తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఇదే - ఆ సెంటిమెంట్ క‌లిసివ‌స్తుందా

Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఇదే - ఆ సెంటిమెంట్ క‌లిసివ‌స్తుందా

HT Telugu Desk HT Telugu

19 September 2022, 8:12 IST

  • Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ అదివారం విడుదలచేసింది. స్కై బ్లూ కలర్ జెర్సీలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తో పాటు మిగిలిన క్రికెటర్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, సూర్యకుమార్ యాదవ్ (twitter/bcci)

హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, సూర్యకుమార్ యాదవ్

Team India New Jersey: ఇకపై టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీలో క‌నిపించ‌నున్నారు. టీమ్ ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం రిలీజ్ చేసింది. స్కై బ్లూ కలర్ లో డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ జెర్సీని రోహిత్, శర్మ, హార్ధిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ తో ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ధరించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ నెల 20న ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరుగనున్న టీ20 మ్యాచ్ ద్వారా కొత్త జెర్సీలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కనిపిస్తారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ లతో పాటు టీ20 వరల్డ్ కప్ లో ఇదే జెర్సీ ధరించబోతున్నారు.

2007 వరల్డ్ కప్ లో స్కై బ్లూ కలర్ జెర్సీ ధరించి టీమ్ ఇండియా ఆటగాళ్లు కనిపించారు. అదే ఏడాది ధోనీ సారథ్యంలోని యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్నది. మరోసారి అదే కలర్ జెర్సీ ధరించి టీ20 వరల్డ్ కప్ లో బరిలో దిగబోతున్నది టీమ్ ఇండియా. కలర్ సెంటిమెంట్ మరోసారి కలిసి వస్తుందని క్రికెట్ అభిమానులు పేర్కొన్నాడు

. గత ఏడాది అక్టోబర్ లోనే టీమ్ ఇండియా జెర్సీ కలర్ లో బీసీసీఐ మార్పులు చేసింది. ఏడాది ముగియకముందే మరోసారి మార్చడం ఆసక్తికరంగా మారింది.