తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus 4th Test Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - మ్యాచ్‌కు హాజ‌రైన మోదీ, ఆసీస్ ప్రైమ్ మినిస్ట‌ర్‌

IND vs AUS 4th Test Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - మ్యాచ్‌కు హాజ‌రైన మోదీ, ఆసీస్ ప్రైమ్ మినిస్ట‌ర్‌

09 March 2023, 9:15 IST

  • IND vs AUS 4th Test Toss: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య నిర్ణ‌యాత్మ‌క నాలుగో టెస్ట్ గురువారం మొద‌లైంది. ఈ మ్యాచ్ కు ప్ర‌ధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆంథోనీ ఆల్బ‌నీజ్ హాజ‌ర‌య్యారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి

IND vs AUS 4th Test Toss: ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఈ మ్యాచ్‌కు ప్ర‌ధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆంథోనీ ఆల్బ‌నీజ్ హాజ‌ర‌య్యారు. ఇరు జ‌ట్ల కెప్టెన్ల‌కు ప్ర‌ధాన మంత్రులు క్యాప్‌ల‌ను అంద‌జేశారు. సిరీస్ సొంతం చేసుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన ఈ టెస్ట్‌లో ఇండియా ఒక మార్పుతో బ‌రిలో దిగింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రెస్ట్ కార‌ణంగా మూడో టెస్ట్‌కు దూర‌మైన ష‌మీ తిరిగి జ‌ట్టులో చేరాడు. సిరాజ్‌కు విశ్రాంతి నిచ్చారు. బ్యాటింగ్ ప‌రంగా విఫ‌ల‌మ‌వుతోన్న వికెట్ కీప‌ర్ భ‌ర‌త్ తో పాటు శ్రేయ‌ర్ అయ్య‌ర్‌పై మ‌రో సారి టీమ్ మేనేజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచింది. మ‌రోవైపు ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో బ‌రిలో దిగింది.

టీమ్ ఇండియా జ‌ట్టు ఇదే

విరాట్ కోహ్లి, శుభ్‌మ‌న్ గిల్‌, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కోన భ‌ర‌త్‌, జ‌డేజా, అశ్విన్‌, ష‌మీ, అక్ష‌ర్ ప‌టేల్‌, ఉమేష్ యాద‌వ్‌