తెలుగు న్యూస్  /  Sports  /  Australia Vs West Indies As Smith And Marnus Labuschagne Hit Double Hundreds

Australia vs West Indies: స్మిత్‌, లబుషేన్‌ డబుల్‌ సెంచరీల మోత.. ఆస్ట్రేలియా భారీ స్కోరు

Hari Prasad S HT Telugu

01 December 2022, 14:35 IST

    • Australia vs West Indies: స్మిత్‌, లబుషేన్‌ డబుల్‌ సెంచరీల మోత మోగించడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో హెడ్‌ 99 రన్స్‌ దగ్గర ఔటయ్యాడు.
టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ చేసిన స్మిత్
టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ చేసిన స్మిత్ (AFP)

టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ చేసిన స్మిత్

Australia vs West Indies: వెస్టిండీస్‌తో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లకు 598 రన్స్‌ భారీ చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమ్‌లో మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ డబుల్‌ సెంచరీలో మోత మోగించారు. అటు ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా 65, ట్రెవిస్‌ హెడ్‌ 99 రన్స్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీంతో రెండో రోజు మూడో సెషన్‌లో 598 రన్స్‌ దగ్గర ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి రోజును 2 వికెట్లకు 293 రన్స్‌ దగ్గర ముగించిన ఆస్ట్రేలియా.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. లబుషేన్‌, స్మిత్‌ మూడో వికెట్‌కు ఏకంగా 251 రన్స్‌ జోడించారు. ఈ క్రమంలో మొదట లబుషేన్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. 350 బాల్స్‌లో 204 రన్స్‌ చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత ట్రెవిస్‌ హెడ్‌తో కలిసి మరో భాగస్వామ్యాన్ని స్మిత్‌ నెలకొల్పాడు. అతడు హెడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు మరో 196 రన్స్‌ జోడించాడు. 311 బాల్స్‌లో అతడు కూడా డబుల్‌ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో స్మిత్ కు ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం విశేషం. హెడ్ కూడా సెంచరీ చేసేలా కనిపించినా.. చివరికి 95 బాల్స్‌లో 99 రన్స్‌ చేసి బ్రేత్‌వేట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

వెస్టిండీస్‌ బౌలర్లలో బ్రేత్‌వేట్‌ 2, మేయర్స్‌, సీల్స్‌ చెరొక వికెట్ తీశారు. అంతకుముందు సెంచరీతోనే స్మిత్‌ లెజెండరీ క్రికెటర్‌ డాన్ బ్రాడ్‌మన్‌ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కిది 29వ సెంచరీ కావడం విశేషం. తన 88వ టెస్ట్‌లో స్మిత్‌ 29వ సెంచరీ చేయగా.. బ్రాడ్‌మన్‌ 51వ టెస్ట్‌లోనే 29 సెంచరీలు చేశాడు.