తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pak Vs Afg: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ - తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో విక్ట‌రీ

Pak vs Afg: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఆఫ్ఘ‌నిస్తాన్ - తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో విక్ట‌రీ

25 March 2023, 7:16 IST

  • Pak vs Afg: షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుచేసింది. ఆఫ్ఘ‌న్ బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ 92 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌
పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌

పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌

Pak vs Afg: పాకిస్థాన్‌కు ప‌సికూన ఆఫ్ఘ‌నిస్తాన్ షాకిచ్చింది. షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేసిన పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి కేవ‌లం 92 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

18 ప‌రుగుల‌తో ఇమాద్ వ‌సీమ్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 65 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ను ఇమాద్ వ‌సీమ్‌, కెప్టెన్ షాబాద్‌ఖాన్ క‌లిసి 90 ప‌రుగులు ధాటించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ల‌లో ముజీబ్ నాలుగు ఓవ‌ర్లు వేసి 9 ర‌న్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. న‌బీ, ఫ‌రుఖీ ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి.

93 ప‌రుగులు టార్గెట్‌ను నాలుగు వికెట్లు కోల్పోయి 17 ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ ఛేదించింది. బ్యాటింగ్‌లోనూ రాణించిన న‌బీ 38 ప‌రుగుల‌తో ఆఫ్ఘ‌న్‌కు విక్ట‌రీని అందించాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజాంతో పాటు ప‌లువురు సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌కు పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.