తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yash Chawde : 13 ఏళ్లకే చితక్కొట్టాడు.. 178 బాల్స్.. 508 రన్స్.. నాటౌట్

Yash Chawde : 13 ఏళ్లకే చితక్కొట్టాడు.. 178 బాల్స్.. 508 రన్స్.. నాటౌట్

HT Telugu Desk HT Telugu

15 January 2023, 10:31 IST

    • Yash Chawde Score : మూడేళ్ల క్రితం వరకు స్కేటింగ్‌లో సత్తా చాటాడు. ఆ తర్వాత కెరీర్ మార్చుకోవాలనుకున్నాడు. క్రికెట్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా తన బ్యాట్ తో చితక్కొట్టాడు. అతడే 13 ఏళ్ల యశ్ చావ్డే.
యశ్ చావ్డే
యశ్ చావ్డే (twitter)

యశ్ చావ్డే

అండర్ 14(Under 14) కేటగిరీలో ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కప్‌లో సరస్వతీ విద్యాలయ తరపున బరిలోకి దిగిన యశ్ చావ్డే(Yash Chawde) తన బ్యాట్ తో అదరగొట్టాడు. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో జరిగిన ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో రెచ్చిపోయి ఆడాడు. 81 ఫోర్లు, 18 సిక్సులతో మెరుపులు చూపించాడు. భారీ షాట్లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

క్రికెట్ దిగ్గజాలకు కెరీర్ లో సాధ్యం కానీ.. అరుదైన స్కోర్ ను సాధించాడు యశ్ చావ్డే. 178 బంతుల్లో 508 పరుగు చేయడమే కాదు.. నాటౌట్ గా నిలిచాడు. రికార్డు బద్దలు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో 500కి పైగా పరుగులు చేసిన 10వ బ్యాటర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు. నాగపూర్‌లోని జులేలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్ లో సిద్ధేశ్వర్ విద్యాలయతో జరిగిన ఆటలో యశ్ చావ్డే అద్భుతం సృష్టించాడు.

ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), ప్రియాంషు మోలియా (556 నాటౌట్), పృథ్వీ షా (546), డాడీ హవేవాలా (515)లాంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. వాళ్ల సరసన యశ్ చావ్డే చేరాడు.

చావ్డేకు క్రికెట్‌లో పెద్ద పెద్ద విజయాలు సాధించే సత్తా ఉందని అతడి స్కూల్ సూపర్‌వైజర్ కులకర్ణి అన్నారు. క్రమశిక్షణ కలిగిన క్రికెటర్ అని తెలిపాడు. క్రికెట్‌(Cricket)లో చాలా కెరీర్ ఉందని చెప్పుకొచ్చారు. చావ్డే స్కేటింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లో కూడా పాల్గొన్నాడని కులకర్ణి వెల్లడించారు.

178 బంతుల్లో 81 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు చావ్డే. సహచర బ్యాటర్ తిలక్ వాకోడే(97 బంతుల్లో 127)తో కలిసి ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుడిచేతి వాటం ఆటగాడు యశ్. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో 500 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా యశ్ చావ్డే రికార్డు సృష్టించాడు. 2022 ఆగస్టులో అండర్ 15 ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ చిరత్ సెల్లెపెరుమ 553 పరుగు చేశాడు. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో 500 పరుగుల మైలు రాయిని దాటిన మెుదటి ఆటగాడిగా నిలిచాడు.