కల్కి ఎవరు? ఎప్పుడు అవతరిస్తాడు? పాపాత్ములను ఎలా సంహరిస్తాడు?
07 October 2024, 7:48 IST
- కల్కి అవతారం ఎలా ఉంటుంది. ఎప్పుడు అవతరిస్తాడు. కలియగంలో కలి చేసే పనులు ఏంటి అనే విషయాల గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
కల్కి అవతారం అంటే ఏంటి?
కలియుగం చాలా విచిత్రమైనది. మన పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం సమాప్తమై, కలియుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మ వద్ద కలి ప్రత్యక్షమైనాడని, ఆ కలి అవతారం ఈ విధంగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
బ్రహ్మ వద్ద ప్రత్యక్షమైనటువంటి కలి కుడి చేతితో నాలుకను బయటకు లాగి పట్టుకుని, ఎడమ చేతితో మర్మాంగ భాగమును పట్టుకుని వికృతంగా దర్శనం ఇచ్చెను. అప్పుడు బ్రహ్మ వద్ద ఉన్న మహర్షులు ఈ అవతారమేమి? ఈ లక్షణమేమి? అని అడగగా.. ఈ కలియుగంలో జనులు పాప బుద్ధితో ఆహార, ఇతర కోరికలకు లోభింపబడి ఉండెదరని, అలాగే కామ క్రోధాలకు బంధింప బడి ఉంటారని ఇదే కలి స్వరూపమని పురాణాలలో చెప్పబడినట్లు చిలకమర్తి తెలిపారు.
ఇలా ఉన్నటువంటి కలియుగంలో కలి యుగాంతంలో కల్కి భగవానుడు జన్మించి పాపాత్ములను ధర్మ స్థాపన చేస్తారని చిలకమర్తి తెలిపారు. కలియుగము అధర్మములకు, స్వార్థ ప్రయోజనములకు, కుట్రలకు, మోసములకు, పరాభవములకు, వర్ణాశ్రమ ధర్మ భ్రష్టతకు, భక్తిహీనతకు నిలయమై ప్రజలు సుఖ శాంతులకు దూరం కాగలరని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కులాచారములు నశించును. ధన ప్రభావము హెచ్చును. అధములు అధికారులవుతారు. భ్రష్టులు నీచులుకుపదేశింతురు. భూమి పాప పంకిలమై ధర్మదేవత నిలువనేరదు. సుఖశాంతులు నశించును అని చిలకమర్తి తెలిపారు. శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడను విప్రునకు కల్కి మూర్తియను వేదపుత్రుడై అధర్మములను నాశనమొనర్చి పాపాత్ములను దండించి భూభారమును తగ్గించును. అశ్వారూడుడై, ఖడ్గధారియై కల్కిమూర్తి సమస్త లోకములందు తిరుగును.
ధర్మదేవతను సముద్ధరించచుండును. అదెట్లనిన ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణ నిర్యాణము జరిగిన వెనువెంటనే జన్మించిన కలిపురుషుడు సమస్త అధర్మములకు పాపములకు కారణభూతుడు. నూనె కారుచూ, నల్లని శరీరము, నిప్పులవంటి నేత్రములు, గంభీరమగు ఆకారము, కరాళమువంటి నోరు కలవాడు. వావి వరుసల గణింపనివాడు, స్త్రీలోలుడు, అన్యాయము, అసత్యముల ననుష్ఠించువాడు కలిపురుషుడు. కలి పురుషుని వలన లోకమునందు శక్తి నశించును. రోగములు హెచ్చును. అరాచకములు ప్రబలును.
ఆయుర్దాయము తరుగును. కాముకత హెచ్చును. సుఖ శాంతులు పెరుగును. పాపభీతి నశించును. యుక్తా యుక్తములు సమసిపోవును. అన్నింటా అసంఘటనలు అధికమగును. పుణ్యక్షేత్రముల మహత్తు తరుగును. ధనాశ, అధర్మము పెచ్చు పెరిగి ధర్మము కొరతపడును. ఈ కలియుగ అరిష్టములనెల్ల తొలగించు కొనుటకుగాను యుగయుగాలుగా అవతారాలు దాల్చి జగత్తును రక్షించుచున్న శ్రీమన్నారాయణుడు కల్కి అవతారుడై సముద్ధరించును.
యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదములు నాల్గింటిని తర్క, మీమాంస, శ్రీమహావిష్ణువు విష్ణుయశుని పుత్రుడై పుట్టును. పరశురాముని వద్ద రుగ్వేదము, ధర్మ, జ్యోతిష, వ్యాకరణ, వైద్య శాస్త్రముల వారింటిని నిరుక్త, ఛందః, శిక్షా, గురుని ఆజ్ఞ చొ ప్పున బిల్వక్షేత్రమున కేగి పార్వతీ పరమేశ్వరుల సందర్శించి రత్నపు కల్పములను విద్యలను నాల్గింటిని మొత్తము పదునాలుగు విద్యలను నేర్చుకొనెను. పిడికల కత్తిని పరమేశ్వరు నుండి పొంది శత్రుసంహార మొనర్చి మరుత్త దేవులకు పట్టము గట్టుటకై పంపించబడును.
కల్కిమూర్తి సింహళ ప్రభువగు బృహధ్రధునకు కౌముదీదేవి యందు జన్మించిన శ్రీ దేవిని స్వయంవరమున వివాహమాడును. ఆమెను చూచి మోహపరవశులై స్త్రీలుగా మారి, తన భార్యకు చెలికత్తెలై మసలు రాజులనెల్ల కలికిమూర్తి కరుణించును. కలికిమూర్తి చెప్పిన చొప్పున వారెల్లరు రేవా నది యందు స్నానమాడి యధారూపులయి నిజరాజ్యములకేగి ప్రజారంజకముగా పరిపాలన మొనర్చుదురు. అంత కలికి తన భార్యతో బయలుదేరి శంకళ గ్రామమున విశ్వకర్మచే నిర్మింపబడ్డ నూతన నగరమున ప్రవేశించి నివసించుచుండును.
కలికిమూర్తి తన తండ్రిచే అశ్వమేధయాగము చేయించి అశ్వరక్షకుడుగా చతురంగ బలములతో తాను బయలుదేరును. ధర్మభ్రష్టులయి చరించుచున్న రాజులను సంహరించును. లొంగిన రాజులకు ఆశ్రమధర్మములు, జాతి ధర్మ ములు, ప్రజాపాలనాధర్మములు బోధించి - అట్లు రాజ్యపాలన చేయ నాజ్ఞాపించుచు చక్రతీర్ధమును చేరుకొనును. అచ్చట వాఖిల్యాది రుషులు కలికిమూర్తిని దర్శించి తమకు కుంభకర్ణుని మనుమరాలగు కుంభోదరి సంతతి వలన కలుగుచున్న ఇక్కట్లను చెప్పి, వాటినుండి తమ్ము రక్షించవలసినదిగా కోరుదురు.
కలికి మూర్తి రాక్షసులతో పోరాడి వారిని సంహరించును. అటుపిమ్మట హరిద్వారకేగి గంగాస్నాన మొనర్చి పుండరీకమున విశ్రమించెను. సూర్యవంశీయుడగు మరుత్తును, చంద్రవంశీయుడగు దేవాపిని అచ్చట చూచి వారి చరిత్రను విని, తాను జయించిన రాజ్యమును వారికి దానమిచ్చి ధర్మపాలన చేయించెను అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్