Wake up: ఉదయం నిద్రలేవగానే ఏం చూస్తే మంచి జరుగుతుంది?
02 January 2024, 14:55 IST
- Wake up: పొద్దున్నే నిద్రలేవగానే మన కళ్ళ ముందు కనిపించే దృశ్యాల ప్రభావం రోజంతా మన మీద ఉంటుందని అంటుంటారు. అందుకే నిద్రలేచిన వెంటనే ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది.
నిద్రలేవగానే వీటిని చూస్తే మంచిది
Wake up: మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతే అబ్బా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో అంతా మంచే జరిగిందని అనుకుంటాం. అదే ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురైతే మాత్రం ఛీ ఛీ పొద్దునే నిద్ర లేచి ఏం చూశామో అన్ని అవాంతరాలు అనుకుంటారు. పొద్దున్నే నిద్రలేచిన వెంటనే మన కళ్ల ముందు కనిపించే దృశ్యం వల్ల ఆ రోజంతా సంతోషంగా గడుస్తుందని నమ్ముతారు.
లేటెస్ట్ ఫోటోలు
నిద్రలేవగానే వీటిని చూస్తే మంచిది
చాలా మంది దీన్ని నమ్ముతారు. కొంతమంది తమ పిల్లల మొహాలు చూసుకుని ముద్దు పెట్టుకుని నిద్రలేస్తారు. ఇంకొందరు దేవుడి బొమ్మలు చూస్తారు. ఇలా ఎవరి నమ్మకానికి అనుగుణంగా వాళ్ళు నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తూ ఉంటారు. . మరికొందరు దేవుడి తలుచుకుని అరచేతులు రుద్దుకుని మొహానికి అద్దుకుని నిద్రలేస్తారు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ పొద్దున్నే ఇలా చేసి నిద్రలేవడం అనేది చాలా మంచి పద్ధతి.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరమూలే తు గోవిందా ప్రభాతే కరదర్శనం
ఈ శ్లోకం మనసులో చదువుకుని నిద్రలేస్తే ఆ రోజంతా మంచే జరుగుతుంది. అంటే చెయ్యి పైభాగాన లక్ష్మీదేవి, అరచేతుల్లో సరస్వతి, చివరి భాగంలో గౌరీ దేవి ఉంటారు. ఈ ముగ్గురిని తలుచుకోవడానికి కారణం ఉంది. ఏ పని చేసినా లక్ష్మీదేవి ఆశీర్వాదం లేకుండా సంపద ఉండదు. చదువులో రాణించాలంటే సరస్వతీ దేవి కటాక్షం ఉండాలి. ఇక గౌరీ దేవి శక్తికి ప్రతిరూపం. చెడు, మంచి ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే చేతుల్లో కొలువై ఉన్న ఈ ముగ్గురు అమ్మవార్లని తలుచుకుంటూ నిద్రలేవడం మంచిదని పండితులు చెబుతారు.
ఇవి చూడకూడదు
నిద్రలేవగానే పగిలిన, పని చేయని గడియారాలు చూడకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. పొద్దున్నే నిద్రలేచినప్పుడు వాటిని చూడటం వల్ల అందులోని నెగటివ్ ఎనర్జీ మన కళ్ళ ద్వారా శరీరంలోకి వచ్చేస్తుంది. దీని వల్ల ఏ పని తలపెట్టినా దానికి ఆటంకాలు ఎదురవుతాయి.
మనలో చాలా మందికి ఉండే అలవాటు లేవగానే అద్దంలో మొహం చూసుకోవడం. ఎలా ఉన్నామా అనుకుంటూ చూసుకుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అద్దంలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే పడక గదిలో కూడా అద్దం పెట్టుకోకూడదని చెప్తారు. పగిలిన వస్తువులు, కుర్చీలు వంటివి కూడా చూడకపోవడం మంచిది. పనికి రాని వస్తువుల్లో నెగటివ్ ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. అందుకే వాటిని కూడా చూడకూడదు.
ప్రకృతికి సంబంధించిన అందమైన దృశ్యాలు ఉన్న ఫోటోలు చూడటం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది. అందుకే నిద్ర లేవగానే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చేస్తే మంచిది.