Vastu Tips For Car: కారులో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ వస్తువులు తప్పనిసరిగా పెట్టుకోవాలి
Vastu Tips For Car: ఇంటి వాస్తు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అలాగే కారు వాస్తు సరిగా ఉండేలా చూసుకోవాలి. దోషాలు తొలగిపోవాలంటే ఈ ఏడు వస్తువులు కారులో పెట్టుకోవాలి.

నూతన వాహనం కొనుగోలు చేసేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుంటారు. కొబ్బరికాయ కొట్టి కొత్త వాహనానికి ఆహ్వానం పలుకుతారు. తర్వాత కారుని ఆలయానికి తీసుకెళ్ళి పూజలు చేయించి అందంగా అలకరించుకుంటారు. చాలా మంది కారు కొనుగోలు చేసిన తర్వాత చేసే పనులు ఇవే.
ఇవి మాత్రమే కాదు కారు కొన్న తర్వాత చేయాలసిన ముఖ్యమైన పనులు ఇంకొన్ని ఉన్నాయి. ఇంటి విషయంలో మాత్రమే కాదు వాహనం విషయంలో కూడా వాస్తు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కారులో కొన్ని వస్తువులు పెట్టుకోకుండా ఉంటే ప్రతికూల శక్తులు మీ మీద ప్రభావం చూపుతాయి. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాహనం ప్రతికూలతని తొలగించుకోవడం కోసం ఈ ప్రత్యేక నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
దేవుడి విగ్రహం
వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే కారు డ్యాష్ బోర్డు మీద వినాయకుడు, దుర్గామాత లేదా మీకు ఇష్టమైన దేవుడి విగ్రహం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. దేవతల అనుగ్రహం పొందుతారు. ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. వినాయకుడి విగ్రహం పెడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు హనుమంతుడి బొమ్మని కారులో హ్యాంగ్ చేసుకోవచ్చు.
నల్ల తాబేలు
కారులోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే నల్ల తాబేలు పెట్టుకోవాలి. ఇది శుభప్రదంగా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో నల్ల తాబేలుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే కారులో నల్ల తాబేలు పెట్టుకుంటే ప్రయోజనకరమని అంటారు.
వాటర్ బాటిల్
కారులో తప్పనిసరిగా ఉంచుకోవాలిన దాంట్లో వాటర్ బాటిల్ ఒకటి. ఇది మీకు దాహం తీర్చడం మాత్రమే కాదు కారు లోపల ఉన్న ప్రతికూల శక్తులని తప్పించేస్తుంది. అలాగే కారు సీటు కింద రాతి ఉప్పు పెట్టుకోవడం కూడా మంచిదే. ఈ పరిహారం ప్రమాదాల అవకాశాన్ని తగ్గిస్తుంది. కానీ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వీటిని ఫాలో అయితే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు.
నెమలి ఈకలు
నెమలి ఈకలు లేదంటే దుర్గామాతకి ఇష్టమైన చున్రీ( ఎరుపు రంగు వస్త్రం) కారులో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. కారులోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని నివారిస్తుందని నమ్ముతారు.
క్రిస్టల్ స్టోన్
కారులో క్రిస్టల్ స్టోన్ ఉంచడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఇది కారులో పాజిటివ్ ఎనర్జీని నిలిపి ఉంచుతుంది.
చైనీస్ నాణేలు
బంగారు రంగు చైనీస్ నాణేలు ఉంచడం కూడా శుభకరం. ఇది కారు రంగు, పరిమాణం మధ్య సమతుల్యతని కాపాడుతుంది. వాహనంలోని నిర్మాణ లోపాలని తొలగిస్తుందని నమ్మకం.
కారులో ఈ వస్తువులు ఉంచకూడదు
వాస్తు ప్రకారం విరిగిన, పగిలిన వస్తువులు ఇంట్లో మాత్రమే కాదు కారులో కూడా ఉండకుండా చూసుకోవాలి. అలాగే కారు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురికి, దుమ్ము తుడిచివేయాలి. కారు అద్దాల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.