తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Magha Masam 2024: మాఘ మాసంలో చేసే గౌరీ వ్రతానికి ఎందుకు అంత ప్రాముఖ్యత.. ఈ వ్రత మహత్యం ఏంటి?

Magha masam 2024: మాఘ మాసంలో చేసే గౌరీ వ్రతానికి ఎందుకు అంత ప్రాముఖ్యత.. ఈ వ్రత మహత్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu

09 February 2024, 11:24 IST

    • Magha masam 2024: పుణ్య కార్యాలు చేసేందుకు పవిత్రమైన మాసం మాఘ మాసం. ఈ మాసంలో చేసే స్నానానికి, గౌరీ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు. 
మాఘ మాసంలో చేసే గౌరీ వ్రత మహత్యం
మాఘ మాసంలో చేసే గౌరీ వ్రత మహత్యం

మాఘ మాసంలో చేసే గౌరీ వ్రత మహత్యం

Magha masam 2024: మాఘమాసంలో ఉదయాన్నే నదీస్నానం చేయటం తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠనం చేయడం అనేవి ముప్పై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

ఈ వ్రత విశేష మేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియజెప్పడమే కాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపాలు చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూ ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు పశ్చాత్తాపం పొంది ఇకమీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండవ అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది.

రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకునే సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్థిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లుగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మాఘస్నాన ఫలితంపై పురాణ కథ

పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడ వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు వద్ద చాలా మంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడికి ఇచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండే వాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది.

సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాళ్ళీరదేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాళ్ళీరదేశవాసి అకాలమరణం చెందాడు.

తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢవ్రతుడనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు అ యోగికి అతిథి పూజాసత్కారాలు చేసి తన కుమార్తెకు వచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకు వచ్చిందో తెలియటం లేదన్నాడు.

యోగి దివ్యదృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, చేయకూడని పనులు చేయటం లాంటి పాపాలు చేసిందని అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నది తీరంలో గౌరీవ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుని ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వజన్మపాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వళ్లే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడనే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు.

ఇకమీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తెకు పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియ నాడు గౌరీ వ్రతం, సువాసినీ పూజ చేస్తే ఇకమీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు.

వెంటనే ఆగురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియ నాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతర కాలంలో అమె పుణ్య ఫలితంగా సుఖాలను పొందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం