వార ఫలాలు: సంక్రాంతి పండుగ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే
14 January 2024, 2:00 IST
- Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జనవరి 14 నుంచి 20 వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు(14.01.2024 నుంచి 21.01.2024)
రాశిఫలాలు (వార ఫలాలు) 14.01.2024 నుండి 20.01.2024 వరకు
లేటెస్ట్ ఫోటోలు
సంవత్సరం : శోభకృత్ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : పుష్యం
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదాపడతాయి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొత్త వ్యక్తులను తొందరపడి నమ్మడంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతాయి. వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. సోదర వర్గ సహకారం ఉంటుంది. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అనుకున్న విషయాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఇంతకు ముందు రుణములు తీసుకున్న వారు చెల్లిస్తారు. ఆత్మీయ వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శద్ధ తీసుకోవాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య సంబంధాలు అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోదాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటారు. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు. సంతాన విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలుంటాయి. పూర్వ రుణాలు చెల్లిస్తారు. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్హకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదివారం సూర్యాష్టకాన్ని పరించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. స్నేహితులతో అభిప్రాయ భేదం రాకుండా జాగ్రత్తపడాలి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధను పెంచుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశముల కొరకు మీ సహకారం ఉంటుంది. కుటుంబములో స్త్రీల ఆరోగ్య, ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో అనుకూలంగా ఉంటారు. వ్యవసాయపరంగా అనుకూలం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పరించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు సమయానికి పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. దానివలన వృత్తిపరమైన అలసట, అనారోగ్య సమస్యలు ఏర్పడును. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్యమీద ఆసక్తి పెంచుకోవాలి. కుటుంబముతో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. గృహ, వాహన సంబంధ అంశాలలో చిన్నపాటి మరమ్మత్తుకు అవకాశం. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలాకాలంగా చూస్తున్న రావలసిన ఆదాయం అందుకుంటారు. మాట విలువ గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాల కొరకు ప్రణాళికలు వేసుకుంటారు. వ్యక్తుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక శ్రద్ధ, అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులుంటాయి. వ్యక్తిగతమైన సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. బహుమానాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువులతో సంప్రదిస్తారు. ఇతరులకు రుణాలు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. మాట పట్టింపులు లేకుండా వాగ్వివాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. దూర ప్రయాణములలో కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. సంతానం అభివృద్ధి కొరకు అలోచిస్తారు. వ్యవసాయ సంబంధ అంశాల మీద దృష్టి పెడతారు. ప్రతి విషయంలోనూ మానసికంగా అందోళన, వైరాగ్యంగా ఆలోచనలు అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అధ్యాత్మిక ఆలోచనలతో స్వాగతం పలుకుతారు. గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల. ఆశించిన ప్రదేశాలకి, స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సమయానికి నిద్ర, ఆహార స్వీకరణ అవసరం. నూతన విషయాలను తెలుసుకుంటారు. దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. ధనూ రాశివారు ఈవారం మరింత శుభ ఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరిస్తారు. బాధ్యతలు అధికముగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు. భూమి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. తోబుట్టువులతో నిదానమవసరం. భాగస్వామి సంబంధ అంశాలు ఒక్కరికి వస్తాయి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంతాన సంబంధ విద్యా ఆరోగ్య అభివృద్ధి అంశాలలో కొన్ని ఉద్వేగాలకు లోనవుతారు. ఒక వార్త ఘర్షణతో కూడిన ఆనందాన్నిస్తుంది. సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నూతన గృహ వాహన కొనుగోలు అంశాలలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దలు, గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది. విదేశీపరమైన విద్యకు అవకాశంగా సూచనలున్నాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికి ఉపయోగాన్నిస్తాయి. వృత్తిపరంగా కొంత అధిక శ్రమ. నూతన బాధ్యతలకు అవకాశముంది. వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకు అవకాశముంది. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికి అత్మబలముతో వాటిని జయిస్తారు. గురువులను, పెద్దలను కలసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. ఆత్మీయ మిత్రుల సహకారాన్ని కోరుకుంటారు. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు చేయు ప్రయత్నాలు ముందుకు వెళతాయి. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000