Lakshmi devi: అమావాస్య రోజు ఇలా చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు
Goddess lakshmi devi: ఈరోజు అమావాస్య. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది.
Goddess lakshmi devi: ఈ సంవత్సరం మొదటి అమావాస్య జనవరి 11న వచ్చింది. హిందూ శాస్త్రంలో మార్గశిర అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య గురువారం రావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈరోజు కొన్ని చర్మలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు ఈ పరిహారాలు చేయండి. ఇలా చేస్తే మీ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.
మార్గశిర అమావాస్య పరిహారాలు
అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి.
అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఈరోజు ఆవుని సేవించడం మంచిది. గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించాలి. అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
పశువులు, జంతువులని పొరపాటున కూడా ఇబ్బంది పెట్టకూడదు.
మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు.
ఇంట్లోని ప్రతికూల శక్తులని తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి.
పితృ దేవతలని ఇలా ప్రసన్నం చేసుకోండి
పితృ దేవతలని ప్రసన్నం చేసుకోవడానికి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్దకార్యాలు చేయడం ద్వారా పితృ దేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృ దేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయడం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఈరోజు పితృ స్తోత్రం, పితృ కవచం పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృ దేవతల అనుగ్రహం పొందుతారు.
శని దేవుడి ప్రభావం ఇలా తగ్గించుకోండి
కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశి వారిపై శని సడే సతీ, దయ్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే అమావాస్య రోజు ఈ రాశుల వాళ్ళు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శని చెడు ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. శని దేవుని అనుగ్రహం పొందటం కోసం ఈరోజు శని చాలీసా పఠించాలి.
అమావాస్య రోజున శివుడ్ని పూజించడం వల్ల శని దేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతీ, దయ్యా చెడు ప్రభావం, పితృ దోషం, కాలసర్ప దోషం నుంచి బయట పడేందుకు శివలింగానికి బిల్వ పత్రాలు, గంగాజలం, పచ్చి పాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది.