Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఈ ఏడాది కలిసొస్తుంది-makara rasi 2024 new year rasi phalalu check your capricorn zodiac sign for astrological predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఈ ఏడాది కలిసొస్తుంది

Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఈ ఏడాది కలిసొస్తుంది

HT Telugu Desk HT Telugu
Dec 20, 2023 09:40 AM IST

Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు బాగున్నాయని, ఈ ఏడాది కలిసివస్తుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. నూతన సంవత్సర రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు
Makara Rasi 2024: మకర రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు (Pixabay)

2024వ సంవత్సరం మకరరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చే సంవత్సరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటటువంటి మకర రాశి వారికి 2024 సంవత్సరంలో మార్చు కనిపిస్తుందని చిలకమర్తి తెలిపారు.

మకరరాశి వారికి 2024లో ద్వితీయస్థానం అనగా ధనస్థానం, కుటుంబ స్థానం వాక్‌ స్థానంలో శని సంచరించడం ఏలినాటి శనియొక్క అంత్య భాగం అవ్వడం వలన కొన్ని చికాకులు, సమస్యలు ఏర్పడును.

అయినప్పటికి 2024 సంవత్సరంలో మకరరాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాలలో అనుకూలంగా వ్యవహరించడం చేత మకరరాశి వారికి 2024 సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగించు సంవత్సరమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మకర రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్ధికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అంది వచ్చును. 2024లో మకరరాశి వ్యాపారస్తులకు అప్పుల బాధ అధికముగా ఇబ్బంది పెట్టు సూచనలున్నాయి.

మకరరాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకరరాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబపరంగా వృత్తిపరంగా సంతృప్తినిచ్చును. 2024 సంవత్సరం మకర రాశివారికి ద్వితీయార్థం అధికముగా లాభించును అని చిలకమర్తి తెలిపారు.

మకర రాశి 2024 ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో మకరరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించును. గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. 2024 సంవత్సరంలో ప్రేమ విషయాలలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును. జీవిత భాగస్వామితో అనందముగా ఆహ్లాదకరంగా గడిపెదరు. శారీరక సౌఖ్యం ఆనందము పొందెదరు.

మకర రాశి 2024 ఆర్థిక విషయాలు

2024 సంవత్సరం మకరరాశివారికి ఆర్థికపరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును. మకరరాశి వారు ఈ సంవత్సరం షేర్‌ మార్కెట్‌ వంటి రంగాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు. గురుబలం అనుకూలంగా ఉండలం చేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికి ఏదోరకంగా ధన సహాయం కలుగును.

మకర రాశి 2024 కెరీర్

2024 సంవత్సరం మకరరాశి వారికి కెరీర్ పరంగా కలసివచ్చే సంవత్సరం. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కలసివచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగములో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీయొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి పై అధికారుల మన్ననలు పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు ససఫ ఫలీకృతమగును.

మకర రాశి 2024 ఆరోగ్యం

2024 సంవత్సరం మకర రాశి వారికి అరోగ్యపరమైనటువంటి విషయాలలో 2024 కలసివచ్చేటటువంటి సంవత్సరం. 2024లో మకర రాశి వారు కుటుంబపరంగా ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఎలాంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్‌ ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. ఈ సంవత్సరం మకరరాశికి ఆరోగ్యపరంగా కలసివచ్చును. జీవనశైలిలో జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేసెదరు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కలసివచ్చును.

మకర రాశి 2024 పరిహారాలు

మకర రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ ఆలయాలలో శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి. శుభం.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel