Vrishabha Rasi Today : వృషభ రాశి వారికి ఈరోజు ప్రమోషన్, డబ్బుకీ ఢోకా ఉండదు
20 August 2024, 5:31 IST
Vrishabha Rasi 20 August 2024: రాశిచక్రంలో రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఈరోజు వృషభ రాశి వారి ప్రేమ, ఆర్థిక, కెరీర్, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
వృషభ రాశి
Taurus Horoscope Today 20 August 2024: వృషభ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండటానికి భాగస్వామితో వచ్చిన విభేదాలను తొలుత పరిష్కరించుకోండి. మీ వృత్తిపరమైన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆఫీస్‌లో ఈరోజు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
లేటెస్ట్ ఫోటోలు
ఈరోజు ఆరోగ్యం, సంపద రెండూ బాగుంటాయి. ఆఫీసులో కొత్త పనులు చేయడం గురించి ఆలోచించండి. అన్ని సమస్యలను మీరు ఓపెన్ యాటిట్యూడ్‌తో పరిష్కరించుకోగలరని గుర్తుంచుకోండి. ఈ రోజు డబ్బు, ఆరోగ్యంరెండూ మీకు అనుకూలంగా ఉంటాయి.
ప్రేమ
వృషభ రాశి వారు ఈరోజు భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాలి. మూడో వ్యక్తి జోక్యంతో ఏర్పడే సమస్యలను కూడా పరిష్కరిస్తారు. చిన్న చిన్న అలజడుల వల్ల అసౌకర్యం ఏర్పడినా బంధం చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు మంచి శ్రోతగా ఉండాలి. కానీ మీ అభిప్రాయాన్ని భాగస్వామిపై రుద్దకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేమికుడిని సంతోషంగా ఉంచడం మీ లక్ష్యం. రొమాన్స్ చివరి దశలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకునే వారు కొత్త బంధాలకు దూరంగా ఉండాలి.
కెరీర్
ఆఫీసులో మీ క్రమశిక్షణ ప్రమోషన్ రూపంలో మరో మెట్టు పైకి ఎదగడానికి సహాయపడుతుంది. యాజమాన్యం మీ సామర్థ్యాన్ని విశ్వసిస్తుంది, కాబట్టి మీరు ఈ రోజు కొత్త బాధ్యతలను ఆశించవచ్చు. గ్రాఫిక్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్ లు, యానిమేటర్లు, ఐటీ నిపుణులు, ఆటోమొబైల్ నిపుణులు కస్టమర్ ఇంటిని సందర్శించవచ్చు. ఆహార ఉత్పత్తులు లేదా ఫ్యాషన్ యాక్ససరీలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఈ రోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి లైసెన్సింగ్ సమస్యలు కూడా ఉంటాయి.
ఆర్థిక
వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక జీవితం హైలైట్. అదనపు వ్యాపారంతో సహా అనేక మార్గాల నుంచి మీకు డబ్బు వస్తుంది. మీ దీర్ఘకాలిక కలలను నెరవేర్చుకోవడం సులభం అవుతుంది. డబ్బును చక్కగా నిర్వహించడానికి ఆర్థిక ప్రణాళికను అనుసరించండి. ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. కొంతమంది జాతకులు పెండింగ్ బకాయిలను చెల్లించడంలో వారి జీవిత భాగస్వామి కుటుంబం నుండి మద్దతు పొందుతారు.
ఆరోగ్యం
పెద్ద ఆరోగ్య సంబంధ సమస్యలు ఉండవు. కానీ మెట్లపై నడిచేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షంలో డ్రైవింగ్ చేయవద్దు. సాహస క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు గాయాలు, చర్మం గీతలు పడొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.