(1 / 6)
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, సుచిత్ర, పేట్ బషీరాబాద్, గుండ్ల పోచంపల్లి, బోయిన్‌పల్లి, ప్రగతి నగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురిసింది.
(2 / 6)
హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్, మారేడుపల్లి, బేగంపేట, కోఠి, మలక్‌పేట్, గచ్చిబౌలి, టోలిచౌకీ సహా చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.
(3 / 6)
షేక్‌పేట ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిచిపోగా... షేక్‌పేట, ఫిలింనగర్, గచ్చిబౌలి మార్గంలో, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు.
(4 / 6)
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
(5 / 6)
రానున్న మూడు గంటల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
(6 / 6)
ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, మేడ్చల్-మల్కాజిరిగి, నాగర్ కర్నూల్, నల్గొండ, ఆసిఫాబాద్, నిర్మల్ , నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వాన పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇతర గ్యాలరీలు