తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ ఒక్కటి రోజూ తిన్నారంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతుంది
పురుషుల్లో లైంగిక శక్తి తగ్గిపోవడం వల్ల ఆ ప్రభావం సంతానలేమి మీదా పడొచ్చు. దీన్నుంచి బయటపడటానికి యాలకులు సాయపడతాయి. అదెలాగో చూడండి.
(1 / 7)
ఒత్తిడి వల్ల పురుషుల్లో లైంగిక శక్తి లోపిస్తుంది.జీవనశైలిలో మార్పులు, వ్యసనాలు కూడా పురుషుల్లో లిబిడో (సెక్స్ చేయాలనే కోరిక) తగ్గడానికి దారితీస్తాయి.ఇలాంటి సమస్యలున్న చాలా మంది పురుషులు డాక్టర్ వద్దకు వెళ్లడానికి విముఖత చూపుతారు. నేచురల్ రెమెడీస్ కోసం చూస్తారు.సహజ పద్ధతుల ద్వారా లిబిడోను పెంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.
(2 / 7)
పురుషుల్లో లైంగిక సామర్థ్యం తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు.దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలితో పాటు కొన్ని చెడు అలవాట్లు కూడా లైంగిక నపుంసకత్వానికి కారణమవుతాయి.(Shutterstock)
(3 / 7)
సమజ పద్దతుల ద్వారా లైంగిక శక్తిని పెంచుకోవడం సాధ్యమేనా? సహజసిద్ధంగా లైంగిక శక్తిని పెంచుకోవడం సాధ్యమే. మీ వంటగదిలో యాలకులతో పరిష్కారం దొరుకుతుంది. .యాలకుల వినియోగం పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని వేగంగా మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
(4 / 7)
యాలకులు నిజంగా లిబిడోను పెంచుతాయా? యాలకుల్లోని పోషకాలు శరీరంలో ఉత్సాహాన్ని, లిబిడోను, శక్తిని పెంచడంతో పాటు బరువు పెరగకుండా నిరోధించడంలో ఉపయోగపడతాయి.పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దీన్ని తినవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
(5 / 7)
యాలకులు ల్యూబ్రికేషన్ పెంచుతాయి.ఇది లైంగిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనిని తినడం లేదా దాని నూనెను జననేంద్రియాలకు రాయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది .
(6 / 7)
ఎలా తినాలి? : యాలకుల పొడిని రోజూ ఏ సమయంలో అయినా నమిలి తినవచ్చు. రెండు మూడు యాలకులు నేరుగా నమలవచ్చు. లేదంటే యాలకుల టీ కూడా తయారు చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు