Vrishabha Rashi Today : వృషభ రాశి వారు ఈరోజు భాగస్వామితో వాదించొద్దు, ఆఫీస్‌లో ప్రశంసలు-vrishabha rashi phalalu august 17 2024 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vrishabha Rashi Today : వృషభ రాశి వారు ఈరోజు భాగస్వామితో వాదించొద్దు, ఆఫీస్‌లో ప్రశంసలు

Vrishabha Rashi Today : వృషభ రాశి వారు ఈరోజు భాగస్వామితో వాదించొద్దు, ఆఫీస్‌లో ప్రశంసలు

Galeti Rajendra HT Telugu
Aug 17, 2024 05:24 AM IST

Vrishabha Rashi : వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచిరోజు. ఆర్థికంగా ఈరోజు మీకు కలిసిరానుంది. ఇంటికి మరమ్మత్తులు చేయిస్తారు.

వృషభ రాశి
వృషభ రాశి

Vrishabha Rashi August 17, 2024: ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకొని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ శృంగార జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది.

ప్రేమ

వృషభ రాశి వారు రోజు మీ భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామికి కొంత పర్సనల్ స్పేస్ ఇవ్వండి. రిలేషన్‌షిప్‌లో గత విషయాలను ఎక్కువగా చర్చించవద్దు. ఇది భాగస్వామి మనస్సును దెబ్బతీస్తుంది. ఒంటరి వ్యక్తులు తమ భావాలను తమ భాగస్వామితో పంచుకోవడానికి ఈ రోజు సరైన రోజు. కొంతమంది జాతకులు సాయంత్రానికల్లా కుటుంబ సభ్యులను కలుసుకుని వివాహం గురించి చర్చిస్తారు.

కెరీర్

ఆఫీసులో ముఖ్యమైన పనులు చేసేటప్పుడు అజాగ్రత్తగా వ్యవహరించకండి. ఐటీ నిపుణులు, హెల్త్ కేర్ వర్కర్లు ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆఫీసులో మీ అత్యుత్తమ పనితీరును కనబరచడానికి ప్రయత్నించండి. ప్రశంసలు దక్కుతాయి. ఆఫీసులో కొంతమంది మహిళలు తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకోవచ్చు. ఆ సమయంలో మీరు మౌనంగా వేచి చూడండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి.

ఆర్థిక

ఈ రోజు ఆర్థిక విషయాల్లో అంతా బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఔత్సాహికులకు అనేక ప్రాంతాల నుంచి సులభంగా నిధులు అందుతాయి. బ్యాంకు రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఉత్తమ సమయం. కొంతమంది జాతకులు ఇంటిని మరమ్మతులు చేయించవచ్చు.

ఆరోగ్యం

అనారోగ్యకరమైన పానీయాలు తీసుకోకండి. ఫ్రెష్ జ్యూస్ తాగాలి. రోజూ యోగా, వ్యాయామం చేయాలి. ఈ రోజు మీరు జిమ్‌లో కూడా చేరవచ్చు. కానీ, బరువైన వస్తువులను ఎత్తవద్దు. జంక్ ఫుడ్ తినడం మానుకోండి. మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు రోజు ప్రారంభం నుంచి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.