Dhanu Rasi Weekly Horoscope: ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ప్రమోషన్, కానీ ఇంట్లో ఇబ్బందులు
Dhanu Rasi This Week: రాశిచక్రంలో 9వ రాశి ధనుస్సు రాశి. పుట్టిన సమయంలో ధనుస్సు రాశిలో సంచరించే జాతకుల రాశిని ధనుస్సుగా పరిగణిస్తారు.
Dhanu Rasi Weekly Horoscope August 18 to August 24: ధనుస్సు రాశి వారు ఈ వారం మీ భాగస్వామితో బంధంలోకి అహంకారానికి చోటివ్వకండి. వీలైనంత ఎక్కువ సమయం మీ భాగస్వామితో గడపండి. ఆఫీసులో ఎదురయ్యే సవాళ్లు మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ వారం సౌభాగ్యానికి కొదవ ఉండదు. మీ మానసిక, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ప్రేమ
ధనుస్సు రాశి వారికి ఈ వారం భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని బంధాలు మీకు చికాకు తెప్పిస్తాయి. దాంతో సమస్యలను పరిష్కరించడానికి మీరు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది.
పాత ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి ప్రస్తుత ప్రేమ బంధంలో చీలికను సృష్టించగలవు. బ్రేకప్‌కి దగ్గరగా ఉన్న బంధం మరో 3-4 రోజులు సాధారణ స్థితికి వస్తుంది. ప్రేమకు సంబంధించిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించండి.
కెరీర్
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆఫీస్‌లో ప్రమోషన్ రూపంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. దాంతో మీరు ఆఫీస్‌లో ఎక్కువ సమయం గడపవలిసి వస్తుంది. ఆఫీసులో రాజకీయాలు మీ పనిపై ప్రభావం చూపుతాయి. సీనియర్ వ్యక్తులతో మీతో చికాకులు వస్తాయి.
ఉద్యోగం మానేయాలనుకునే వారు జాబ్ వెబ్ సైట్ లో తమ ప్రొఫైల్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ధనుస్సు రాశి వారికి కొత్త కాల్స్ రావచ్చు. పదోన్నతి, పనితీరును పరిశీలించే అవకాశం కూడా ఉంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థుల కల నెరవేరనుంది. ఇప్పటికే విదేశీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వారు కూడా విదేశాల్లో ఉద్యోగం పొందవచ్చు.
ఆరోగ్యం
మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరు మీ సెలవులను కూడా ప్లాన్ చేసుకుని కుటుంబంతో విహార యాత్రలకి వెళ్లొచ్చు. ధనుస్సు రాశి వృద్ధులలో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చండి.
ఆర్థిక
డబ్బుకు సంబంధించిన పెద్ద సమస్యలు ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఉండవు. వివిధ మార్గాల నుంచి డబ్బు వస్తుంది. మీ తోబుట్టువు లేదా స్నేహితుడికి డబ్బు సహాయం చేస్తారు. స్టాక్ మార్కెట్, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. కొంతమంది మహిళలు ఈ వారం వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు.