Dhanu rashi : ధనుస్సు రాశి వారు ఈరోజు మీ జీవితం నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని అనుకోకుండా కలుస్తారు
Dhanu rashi : ధనుస్సు రాశి వారికి ఈరోజు ఒక సర్‌ప్రైజ్ ఉంటుంది. బ్రేకప్ చెప్పి విడిపోయిన వాళ్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడానికి ఈరోజు మంచిది. మీ ప్రేమకి తల్లిదండ్రుల ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది.
Dhanu rashi August 16: ధనుస్సు రాశి వారుఈరోజు రిలేషన్ షిప్‌లో కాస్త తెలివిగా ఉండండి. వృత్తి జీవితంలో కొత్త పనులకు బాధ్యత వహిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
ప్రేమ
ధనుస్సు రాశి వారి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. స్త్రీలు వేరొకరి మాటలతో ప్రభావితమవుతారు. దాని ప్రభావం మీ జీవితంపై చూపుతుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి నైట్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవచ్చు. కొందరి సంబంధ బాంధవ్యాలకి తల్లిదండ్రుల ఆమోదం లభిస్తాయి. ఇటీవల బ్రేకప్ చెప్పుకున్న వారు ఈ రోజు మాజీ ప్రేమికుడిని కలుస్తారు.
కెరీర్
ఈ రోజు సవాళ్లతో కూడిన పనులను నిర్వహించడంలో సీనియర్లు మీకు సహకరిస్తారు. కొత్త ఆలోచనలతో సిద్ధంగా ఉండండి. ఈ రోజు టీమ్ మీటింగ్ లో మీ ఆలోచనలకి ప్రశంసలు దక్కుతాయి. మీరు సృజనాత్మక పరిశ్రమలో ఉంటే, వినూత్న భావనలతో కొత్త పనులను ప్రారంభించండి. కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులకు నూతన ప్రదేశంలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
ఆర్థిక
ఆర్థిక విషయాల్లో ధనస్సు రాశి వాళ్లు అదృష్టవంతులు. దానధర్మాలకు ఖర్చు చేయవచ్చు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు మంచి రోజు, కానీ ఎవరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వకండి. డబ్బును తిరిగి పొందడంలో ఇబ్బందులు రావొచ్చు. ఈరోజు కొందరు స్త్రీలు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అనేక ప్రాంతాల నుంచి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు.
ఆరోగ్యం
ఆరోగ్యానికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలు తప్పవు. ఈ రోజు మీకు వైరల్ ఫీవర్ లేదా గొంతు ఇన్ఫెక్షన్ సమస్య ఉండవచ్చు. కొందరికి బీపీ, హైపర్ టెన్షన్ సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజూ యోగా, మెడిటేషన్ చేయాలి. ఈ రోజు మీరు జిమ్ లో కూడా చేరవచ్చు, కానీ చాలా బరువైన వస్తువులను ఎత్తవద్దు.