FirstCry share price : స్టాక్​ మార్కెట్​లో ఫస్ట్​క్రై బంపర్​ లిస్టింగ్​- ఇప్పుడు కొంటే మాత్రం నష్టాలు!-firstcry share price extends gain after dream debut buy sell or hold ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Firstcry Share Price : స్టాక్​ మార్కెట్​లో ఫస్ట్​క్రై బంపర్​ లిస్టింగ్​- ఇప్పుడు కొంటే మాత్రం నష్టాలు!

FirstCry share price : స్టాక్​ మార్కెట్​లో ఫస్ట్​క్రై బంపర్​ లిస్టింగ్​- ఇప్పుడు కొంటే మాత్రం నష్టాలు!

Sharath Chitturi HT Telugu
Aug 13, 2024 11:51 AM IST

ఫస్ట్​క్రై ఐపీఓ స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్​ చూసింది. అంతేకాదు, లిస్టింగ్​ నుంచి చాలా పెరిగింది. మరి ఈ ఫస్ట్​క్రై షేర్లు ఇప్పుడు కొనొచ్చా?

స్టాక్​ మార్కెట్​లో ఫస్ట్​క్రై బంపర్​ లిస్టింగ్
స్టాక్​ మార్కెట్​లో ఫస్ట్​క్రై బంపర్​ లిస్టింగ్ (Photo: Courtesy 'X' channel account of NSE)

దేశీయ స్టాక్​ మార్కెట్​లలో ఫస్ట్​క్రై ఐపీఓ దుమ్మురేపింది. మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్​ అయిన ఫస్ట్​క్రై షేరు ధర మార్కెట్ అంచనాలను అధిగమించి దాదాపు 40 శాతం ప్రీమియం సాధించింది. ఈ రోజు బీఎస్​ఈలో ఫస్ట్​క్రై షేరు ధర రూ.625 వద్ద, ఎన్​ఎస్​ఈలో ఏకంగా రూ.651 వద్ద లిస్ట్​ అయ్యింది. అయితే కొత్తగా స్టాక్​ అక్కడితో ఆగలేదు! షేరు లిస్టింగ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఫస్ట్​క్రై షేరు ఎన్ఎస్ఈలో రూ.707.70, బీఎస్ఈలో రూ.707.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కానీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవ్వడంతో ఈ స్టాక్ ఇంట్రాడే గరిష్టానం నుంచి పడింది.

దలాల్ స్ట్రీట్​లో ఫస్ట్​క్రై షేర్లు బలమైన అరంగేట్రం చేసి లిస్టింగ్ లాభాలను మరింత పెంచుకున్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్​క్రై షేరు ధర ఫెయిర్​ వాల్యూ కన్నా రూ.550 నుంచి రూ.575తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ట్రేడవుతోందని, అందువల్ల ఐపీఓ అలాట్​ అయిన వారు ప్రాఫిట్​ బుకింగ్స్​ చేసుకోవాలని సూచించారు. ఫస్ట్​ క్రై బ్రాండ్ మాతృసంస్థ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్​కు అనేక సవాళ్లు ఉన్నాయని, నగదు ప్రవాహాలు, రెగ్యులేటరీ సమస్యలు, పెరుగుతున్న రుణాలతో సహా గణనీయమైన సమస్యలను ఎదుర్కొంటోందని వారు తెలిపారు.

ఫస్ట్​క్రై షేర్​ ప్రైజ్​ టార్గెట్​..

ఫస్ట్​క్రై షేర్ ప్రైజ్​ లిస్టింగ్​పై స్టాక్స్​బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకృతి మెహ్రోత్రా మాట్లాడుతూ.. "ఫస్ట్​క్రై తన ఫిజికల్​- ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​లను సమర్థవంతంగా ఏకీకృతం చేస్తోంది. బలమైన నెట్​వర్క్ ప్రభావాలు, సమర్థవంతమైన కార్యకలాపాల నుంచి ప్రయోజనం పొందుతోంది. ఏదేమైనా, నిరంతర ప్రతికూల నగదు ప్రవాహాలు, రెగ్యులేటరీ సమస్యలు, పెరుగుతున్న రుణాలతో సహా కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్​క్రై ఆదాయం 15 శాతం పెరిగి రూ.6,575.1 కోట్లకు చేరుకోగా, రూ.321.5 కోట్ల నష్టాలు, రూ.176.5 కోట్ల నుంచి రూ.462.7 కోట్లకు అప్పులు గణనీయంగా పెరిగాయి.

"నిధుల సమీకరణ రుణ తగ్గింపు కోసం కాకుండా ఆపరేషన్స్​ అవసరాల కోసం కేటాయిస్తోంది సంస్థ. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మార్కెట్​లో ఈ స్టాక్​పై తొలుత కాస్త ఆసక్తి కనిపించినా, కంపెనీ ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న రుణాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల, లిస్టింగ్ ధర స్వల్పకాలిక మార్కెట్ విశ్వాసాన్ని చూపుతున్నప్పటికీ, అంతర్లీన ఆర్థిక సవాళ్లపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇన్వెస్టర్లు లాభాలను బుక్​ చేసుకుని, పొజీషన్స్​ని స్క్వేర్​​ఆఫ్ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము," అని స్టాక్స్​బాక్స్ నిపుణుడు తెలిపారు.

ఫస్ట్​క్రై షేర్ల లిస్టింగ్ మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉందని కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్​మెంట్ సర్వీసెస్ ఫౌండర్ అరుణ్ కేజ్రీవాల్ తెలిపారు. “బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ షేరు ధర రూ.550 నుంచి రూ.575 మధ్య ఉండొచ్చని తొలుత అంచనాలు ఉండేవి. ప్రస్తుతం ఎన్​ఎస్​ఈలో ఫస్ట్​క్రై షేరు ధర రూ.670గా ఉంది. కాబట్టి, స్టాక్​లో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించొచ్చు. కాబట్టి, కేటాయింపు ప్రక్రియలో బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ షేర్లు పొందిన వారు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్టాక్ సరసమైన విలువ ధరకు చేరుకున్న తర్వాత కొనుగోళ్ల గురించి ఆలోచించవచ్చు,” అని అన్నారు.

(డిస్క్లైమర్: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం)

సంబంధిత కథనం