Ola Electric share price target : జోరు మీదున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు- 15శాతం అప్! ఇప్పుడు కొనొచ్చా?
Ola Electric share price : ఓలా ఎలక్ట్రిక్ షేర్లూ దుమ్మురేపుతున్నాయి! వరుసగా రెండో రోజు కూడా భారీ పెరిగాయి. మరి ఓలా ఎలక్ట్రిక్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత?
ఎలాంటి లాభాలు, నష్టాలు లేకుండా ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పరుగులు పెడుతోంది. శుక్రవారం మార్కెట్లో లిస్ట్ అవ్వగా వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు భారీగా పెరిగాయి. సోమవారం సెషన్ ప్రారంభంలో స్టాక్ 15 శాతం పెరిగింది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడం, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. మరి ఈ స్టాక్‌ని ఇప్పుడు కొనొచ్చా? ఓలా ఎలక్ట్రిక్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత? ఇక్కడ తెలుసుకోండి..
ఓలా ఎలక్ట్రిక్ షేర్ ప్రైజ్ టార్గెట్..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 76 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యింది ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ. అనంతరం ట్రేడింగ్ సెషన్ చివరి నాటికి 20శాతం లాభాలతో 91.20శాతానికి చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్లో 15శాతం పెరిగింది. ఇక ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయానికి 14.5శాతం లాభంతో రూ. 104.5 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర ఇప్పుడు భారీగా పెరుగుతుండటం విశేషం. డిస్కౌంట్ లిస్టింగ్ భయం తొలగిపోయింది. లిస్టింగ్ తర్వాత భారీ కొనుగోళ్లు కనిపించాయి. పైగా ఓలా ఎలక్ట్రిక్ తొలి బైక్‌ని ఆగస్టు 15 న భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు.. మార్కెట్‌ని ఎగ్జైట్ చేశాయి.
"అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులకు మాత్రమే కనీసం 2-3 సంవత్సరాల హోల్డింగ్ వ్యవధిని కొనసాగించాలని మేము సలహా ఇస్తున్నాము. దీర్ఘకాలిక ప్రయాణంలో భాగం కావడానికి ప్రతి డిప్లో బై చేయొచ్చని సిఫార్సు చేస్తున్నాము," అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అన్నారు.
నున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు వచ్చే 12 నుంచి 18 నెలల్లో రూ.140 వరకు పెరగవచ్చని ఓ ప్రముఖ బ్రోకరేజీ సంస్థ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ మార్జిన్లు గణనీయంగా పెరుగుతాయని వెంచురా సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ వినీత్ బొలింజ్కర్ అభిప్రాయపడ్డారు. 2027 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం తర్వాత సంస్థ లాభాల్లోకి వెళుతుందనే సంకేతాలు కనిపిస్తున్నట్టు తెలిపారు. వీటన్నింటినీ కలిపితే వచ్చే 12 నుంచి 18 నెలల్లో షేరు రూ.140కి పైగా చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
“కంపెనీ దృక్పథం పట్ల మేం చాలా సానుకూలంగా ఉన్నాం. రాబోయే మూడేళ్లలో కంపెనీ మార్కెట్ వాటా పెరుగుతుందని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కంపెనీ ఆధిపత్యం పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. దాని పోర్ట్‌ఫోలియో బలంగా ఉంటుంది,” అని బొలింజ్కర్ తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ అనేది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ భాగాలను తయారు చేసే సంస్థ. భారత 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఈ సంస్థకు అత్యధిక మార్కెట్ షేరు ఉంది.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం