Kumbha Rasi Weekly Horoscope : కుంభ రాశి వారి జీవితంలోకి ఈ వారంలో కొత్త వ్యక్తి ప్రవేశం, డబ్బుకీ కొదవ ఉండదు
Kumbha Rasi This Week: కుంభ రాశి వారికి ఈ వారం ఆరంభంలో కాస్త చికాకులు ఉంటాయి. కానీ వారం గడిచేకొద్దీ అన్నీ తొలగిపోతాయి. డబ్బు విషయంలో మాత్రం ఈ వారం కొదవ ఉండదు.
Aquarius Weekly Horoscope August 18 to August 24: కుంభ రాశి వారికి ఈ వారంప్రేమ జీవితంలో క్రమశిక్షణ, దాపరికాలు లేకుండా చెప్పడం అవసరం. వృత్తిపరమైన సమస్యలు ఏవీ ఈ వారం మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. ఆరోగ్యం, సంపద రెండూ మీకు ఈ వారం అనుకూలంగా ఉంటాయి.
ప్రేమ
ఈ వారం మీ ప్రేమ జీవితంలో మీకు చాలా ఉత్సాహాన్నిచ్చే ఒక విషయం జరుగుతుంది. మీ రొమాంటిక్ లైఫ్ కూడా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించి మీ జీవితానికి కొత్త సంతోషాన్ని తీసుకురావచ్చు. మీ ప్రేమ జీవితంలోకి ఈ వారం ఇగోని తీసుకురాకండి.
వివాహిత కుంభ రాశి జాతకులు ఈ వారం ఆఫీసు రొమాన్స్‌కు దూరంగా ఉండాలి. ఆఫీసులో అనవసర విషయాల్లో చిక్కుకోకండి. ఇది మీ జీవితంలో కొత్త సమస్యలను సృష్టిస్తుంది.
కెరీర్
కుంభ రాశి వారికి ఈ వారం ఆరంభంలో ఆఫీస్‌లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. కానీ వారం గడిచేకొద్దీ అన్ని విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయి. ఆఫీసు రాజకీయాలు మీకు చికాకు తెప్పించొచ్చు. మీ పనితీరుపై దృష్టి పెట్టండి, సహోద్యోగులతో కలిసి పనిచేయండి.
ఆర్కిటెక్చర్, ఐటీ, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, యానిమేషన్ రంగాల వారికి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.
ఆర్థికం
కుంభ రాశి వారికి ఈ వారం డబ్బు విషయంలో సానుకూలంగా ఉంది. అదనపు ఆదాయాన్ని స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించండి. డబ్బు వివాదాలను పరిష్కరించడానికి ఈ వారం మీకు సహాయపడుతుంది.
ఆస్తికి సంబంధించిన ఏదైనా చట్టపరమైన వివాదం ఉంటే అది ఈ వారం పరిష్కారం అవుతుంది. డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. గత పెట్టుబడులు కూడా ఈ వారం లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. మార్కెట్ రీసెర్చ్, నిపుణుల సలహా లేకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమం.
ఆరోగ్యం
కుంభ రాశి జాతకుల్లో కొంత మందికి ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి. పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అవసరమైతే వైద్యుడిని కూడా సంప్రదించవచ్చు.
ఈ వారం మీ ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. బయటి ఫుడ్‌కి దూరంగా ఉండటం బెటర్. అదే సమయంలో పుష్కలంగా నీరు కూడా తాగండి. ఈ వారం వ్యాయామం కూడా ప్రారంభించవచ్చు. వారం ఆరంభంలో సిగరెట్, మద్యాన్ని వదిలేయడం ఉత్తమం.