తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2024: ఉగాది పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Ugadi 2024: ఉగాది పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu

09 April 2024, 6:00 IST

    • Ugadi 2024: శోభకృత్ నామ సంవత్సరం ముగిసి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత వివరాలు తెలుసుకోండి. 
ఉగాది పండుగ 2024
ఉగాది పండుగ 2024 (freepik)

ఉగాది పండుగ 2024

Ugadi 2024: యుగ, ఆది అనే రెండు పదాల నుంచి ఉగాది వచ్చింది. తెలుగు వారి పండుగ ఉగాది. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9వ తేదీ జరుపుకుంటున్నాం. చైత్రమాసం ప్రారంభమయ్యే రోజు ఇదే. శోభకృత్ నామ సంవత్సరానికి ముగింపు పలికి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము.

లేటెస్ట్ ఫోటోలు

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

ఈరోజు నుంచి ప్రకృతిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఉగాది రోజు నుంచి చైత్ర మాసం ప్రారంభమవుతుంది. వసంత రుతువు ప్రారంభమవుతుంది. తెలుగు ప్రజలు ఉగాదిగా జరుపుకుంటే కొన్ని రాష్ట్రాలలో గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్ ప్రజలకు చైత్ర మాసం నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఒక్కో రూపంలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రులు నిష్టగా పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమితో ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ముగుస్తున్నాయి.

ఉగాది శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం ఏప్రిల్ 9 ఉగాది పండుగ వచ్చింది. ప్రతిపాద తిథి ఏప్రిల్ 8 రాత్రి 11:50 నుంచి ఏప్రిల్ 9 రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది.

ఉగాది ఆచారాలు

కొత్త సంవత్సరం ఎన్నో కొత్త ప్రణాళికలతో, ఆశయాలకు నాంది పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించి కొత్త బట్టలు ధరించాలి. గుమ్మాలకు మామిడాకులతో తోరణాలను అందంగా అలంకరించుకుంటారు. ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు. గడపలకు పసుపు, కుంకుమలు రాసి మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు. ఇష్టదైవాన్ని మనసారా ఆరాధించి నైవేద్యాలు సమర్పిస్తారు.

షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారు చేసి భగవంతుడికి నివేదించి తర్వాత ఇంటిల్లిపాది స్వీకరిస్తారు. జీవితంలోని ఎన్నో భావోద్వేగాలకు ఉగాది పచ్చడి సంకేతంగా భావిస్తారు. సాయంత్రం ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ పంచాంగ శ్రవణం వింటారు. ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది తెలుసుకుంటారు.

ఉగాది పచ్చడి తీసుకునే ముందు పఠించాల్సిన శ్లోకం

శతాయు వజ్రదేహాయ

సర్వసంపత్క రాయచ సర్వారిష్ట

వినాశాయనింబకం దళబక్షణం

ఉగాది పండుగ కథ

పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు చైత్రమాసం శుక్లపక్షం పాఢ్యమి రోజునే విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. ఈరోజు నుంచే లోకం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈరోజు సృష్టిని ప్రారంభించాడు. భూమిపై మనకు ఒక సంవత్సరం బ్రహ్మకు ఒక రోజుతో సమానంగా ఉంటుంది. మనం పవిత్రమైన నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడికి కొత్త రోజు మొదలవుతుంది.

ఉగాది వెనక ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను తీసుకెళ్లి సముద్రంలో దాచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు మత్స్యవతారం ధరించి రాక్షసుడిని సంహరించి సముద్రంలో దాచిపెట్టిన వేదాలను తిరిగి తీసుకొచ్చాడు. వాటిని బ్రహ్మ దేవుడికి తిరిగి ఇచ్చాడు. ఇదంతా చైత్రమాసం మొదటి రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజునే విశ్వాన్ని సృష్టించడం జరిగిందని నమ్ముతారు. అందుకే ఈరోజును ఉగాది పండుగ జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాలకు మొత్తం 60 పేర్లు ఉన్నాయి. నారాదుడి సంతానం పేర్లే తెలుగు సంవత్సరం పేర్లుగా చెబుతారు.

 

 

తదుపరి వ్యాసం