తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీరు నవగ్రహ ఆలయాలను దర్శించాలి

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీరు నవగ్రహ ఆలయాలను దర్శించాలి

HT Telugu Desk HT Telugu

14 October 2024, 11:18 IST

google News
    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలితములు) తేదీ 03.06.2023 కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలితములు) తేదీ 03.06.2023 కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

లేటెస్ట్ ఫోటోలు

Bollywood: అంబానీ ఈవెంట్‍లో బాలీవుడ్ తారల మెరుపులు.. షారూఖ్, కత్రినా, జాన్వీతో పాటు: ఫొటోలు

Dec 22, 2024, 03:33 PM

Salaar 2: సలార్ విషయంలో ఆ అసంతృప్తి ఉంది.. పార్ట్ 2 నా బెస్ట్ సినిమా అవుతుంది: ప్రశాంత్ నీల్

Dec 22, 2024, 01:24 PM

How to Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!

Dec 22, 2024, 12:35 PM

IRCTC Andaman Tour 2025 : న్యూ ఇయర్ వేళ 'అండమాన్' ట్రిప్..! తగ్గిన టికెట్ ధరలు, హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ఇదే

Dec 22, 2024, 12:25 PM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఆర్థిక కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​

Dec 22, 2024, 12:06 PM

Pregnancy Diet: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాారా..? అయితే మీ డైట్‌లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి

Dec 22, 2024, 11:29 AM

సంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టం

వారం: శని వారం, తిథి: శు. చతుర్దశి నక్షత్రం : అనూరాధ

మేషరాశి ఈరోజు ఫలితాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విశ్రాంతి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన వాటి కోసం ధనాన్ని ఖర్చు చేసేదరు.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

నేటి వృషభరాశి ఫలితాలు

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అలసట పెరుగును. భోజన సౌఖ్యము కలుగును. రాజకీయాలకు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.

నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథునరాశి నేటి రాశిఫలాలు

ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. విశ్రాంతి పొందెదరు. ఆహ్లాదముగా గడిపెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శివాలయాన్ని దర్శించండి. రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథునరాశి వారికి కలసివచ్చును.

శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

నేటి కర్కాటక రాశి ఫలాలు

ఈరోజు కర్కాటక రాశి జాతకులకు అనుకూలముగా లేదు. వివాదాలకు, చర్చలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు, ప్రయాణముల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానము నందు రవి, దశమ స్థానము నందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి నేటి రాశిఫలాలు

ఈరోజు సింహ రాశి జాతకులకు అనుకూలముగా ఉన్నది. ఆహ్లాదముగా గడిపెదరు. అవసరార్థం ధనాన్ని ఖర్చు చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమ స్థానములో రవి ప్రభావం చేత, భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ఫ్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి ఈరోజు రాశి ఫలితాలు

ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలముగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. సౌఖ్యము పొందెదరు. ముఖ్యమైన పనులు కోసం ధనమును ఖర్చు చేసెదరు. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును.

నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

నేటి తులారాశి ఫలితాలు

ఈరోజు తులా రాశి జాతకులకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు పెరుగును. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణములు అనుకూలించును. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన.

శివాలయాన్ని దర్శించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చికరాశి ఈరోజు ఫలాలు

ఈరోజు వృశ్చిక రాశి జాతకులకు రాశిఫలం అనుకూలంగా లేదు. శారీరక శ్రమ అధికము. ఆందోళనలు తగ్గించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు అధికము. ప్రయాణములు లాభించును. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూరాశి ఈరోజు ఫలాలు

ఈరోజు ధనుస్సు రాశి జాతకులకు అనుకూలముగా ఉన్నది. లాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఖర్చులు లాభించును. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకరరాశి నేటి రాశి ఫలితాలు

ఈరోజు మకర రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్త వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును.

నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభరాశి నేటి రాశి ఫలితాలు

ఈరోజు కుంభ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ప్రయాణములో చికాకులు కలుగును. శారీరక శ్రమ ఒత్తిళ్ళు ఏర్పడును. కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఆరో స్థానము నందు కుజుడు, ఐదో స్థానము నందు శుక్రుడు, తృతీయ స్థానము నందు రాహువు అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు.

శివాలయాన్ని దర్శించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీనరాశి ఈరోజు రాశిఫలాలు

ఈరోజు మీన రాశికి అనుకూలంగా లేదు. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ వ్యవహారాల యందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియత్రించుకోవాల్సిన సమయము. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత వాదనలకు దూరంగా ఉండాలి.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

తదుపరి వ్యాసం