Phulera dooj: నేడే ఫూలేరా దూజ్.. ఈరోజు ఇలా చేశారంటే మీకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది
12 March 2024, 7:00 IST
- Phulera dooj: రాధాకృష్ణుల ప్రేమకి ప్రతీకగా, హోలీ పండుగ ప్రారంభానికి సూచికగా ఫూలేరా దూజ్ వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు ఏ పనులు చేపట్టినా విజయం తథ్యం. మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈరోజు ఇలా చేయండి.
ఫూలేరా దూజ్
Phulera dooj: ఫాల్గుణ మాసం శుక్ల పక్షం రెండో రోజున ఫూలేరా దూజ్ వేడుక జరుపుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ రోజునే రంగులతో కాకుండా పూలతో హోలీ ఆడారని నమ్ముతారు. రంగుల పండుగ హోలీని ఆహ్వానిస్తూ కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ రోజునే శ్రీకృష్ణుడు బ్రహ్మ దేవుడు సమక్షంలో రాధని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఫూలేరా దూజ్ పండుగని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా బ్రజ్ ప్రాంతంలో అత్యంత కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఫూలేరా దూజ్ మార్చి 12వ తేదీన వచ్చింది.
హిందూ శాస్త్రాల ప్రకారం ఫూలేరా దూజ్ ని ప్రత్యేకంగా అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు ఎటువంటి దోషాలు లేకుండా ముహూర్తం శుభంగా ఉంటుందని చెప్తారు. వివాహం వంటి ఏదైనా పవిత్రమైన శుభకార్యాల కోసం ఈరోజు ఎంచుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఫులేరా లూజ్ అనువైన రోజు. బ్రజ్ ప్రాంతంలో శ్రీకృష్ణుడిని ఈరోజు అందంగా ముస్తాబు చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతారు.
ఫూలేరా దూజ్ వేడుకలు
ఉత్తరప్రదేశ్ లోని మధుర, బ్రజ్, బృందావన్ వంటి ప్రాంతాలలో ఈ వేడుకను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈరోజు నుంచి హోలీ సంబరాలు ప్రారంభమవుతాయి. కొంతమంది హోలీ పండుగకు ఈరోజు నాందిగా భావిస్తారు. ఇస్కాన్, కృష్ణుడు దేవాలయాలలో హోలీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఆలయాలు అందంగా పూలతో అలంకరిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం ఫూలేరా దూజ్ శుభకార్యాలు నిర్వహించడానికి అనువైనది. రోజు మొత్తం శుభముహూర్తం ఉంటుంది. ఈ రోజున వివాహం చేసుకుంటే జీవితాంతం సంతోషంగా గడుపుతారని నమ్ముతారు. ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు భక్తుల కోరికలు అన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు.
సాధారణంగా హోలీ కి 8 రోజుల ముందు నుంచి శుభకార్యాలు జరిపేందుకు అశుభ సమయంగా పరిగణిస్తారు. అందువల్ల హోలీకి ముందు వచ్చే ఫూలేరా దూజ్ పవిత్రమైన వివాహ ముహూర్తాలకు శుభకరమైనదిగా పరిగణిస్తారు. అత్యంత పవిత్రమైన రోజు కావున వివాహాలు, వేడుకలు, వాహన కొనుగోళ్ళు వంటివి చేస్తారు. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయం, శ్రేయస్సు లభిస్తుంది.
దాంపత్య జీవితం బాగుండాలంటే..
ఫూలేరా దూజ్ రోజున ఆలయంలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువుని విరాళంగా ఇవ్వడం వల్ల వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోతుంది. దాంపత్య జీవితంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటుంటే ఫూలేరా దూజ్ రోజున రాధాకృష్ణులకు పసుపు వస్త్రాలు, పువ్వులు సమర్పించాలి. అలాగే వెన్న, స్వీట్లు ప్రసాదంగా సమర్పించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
కోరుకున్న వ్యక్తి భర్తగా రావాలంటే..
సంతోషకరమైన సంపూర్ణమైన వైవాహిక జీవితం కోసం ఈరోజు శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. మీరు కోరుకున్న భాగస్వామిని పొందాలని అనుకుంటున్నాట్లయితే ఫూలేరా దూజ్ రోజున ఒక తెల్లని కాగితం పై కుంకుమతో మీ భాగస్వామి పేరు రాసి దాన్ని రాధాకృష్ణుల పాదాల వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం జరుగుతుంది.