నేటి రాశి ఫలాలు..ఈ రాశుల జాతకులు శెనగలు దానం ఇస్తే మంచి జరుగుతుంది
01 February 2024, 0:05 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 01.02.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today rasi phalalu: ఫిబ్రవరి 1వ తేదీ రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.02.2024
లేటెస్ట్ ఫోటోలు
వారం: గురువారం, తిథి : షష్టి
నక్షత్రం : చిత్త, మాసం : పుష్యం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదరణ పొందుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. స్థిరచరాస్తుల ద్వారా అదాయం సమకూరుతుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నిర్మాణ పనుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంగా అనుకూలం. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబముతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. విద్యార్థులకు మంచికాలం. కళాకారుల ప్రతిభకు తగిన అవకాశాలొస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంతో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అరోగ్యం అనుకూలం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూల స్థాన చలన మార్చు. కోర్టు కేసుల్లో తాత్మాలిక ఊరట లభిస్తుంది. ప్రయాణాల ద్వారా పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక లోటు ఉండొచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి. శివపార్వతులు అర్భానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం వల్ల సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్ధయాత్రలు చేపడతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు శ్రమకాలం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా కలసివస్తుంది. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అదృష్టం కలసివస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకి గాని శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమయస్ఫూర్తితో స్పందిస్తారు. శ్రమపెరగవచ్చు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఓపికతో పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. లావాదేవీలు లాభదాయకం. కోర్టు సమస్యలు తీరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆత్మీయుల సహకారం లఖిస్తుంది. ప్రయాణాలు కలసివస్తాయి. అస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పనులపై శ్రద్ధ పెడతారు. నలుగురికి సాయపడతారు. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. న్యాయపరమైన ఆటంకాలను అధిగమిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంతో ఉటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాహాది శు భకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగులో చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉటుంది. ఆలోచించి పనులు చేపడతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలు రాకుండా చూసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో కాలయాపన ఉంటుంది. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. శుభకార్యాలకు హాజరవుతారు. శివపార్వతుల అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు, అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. భూమి కొనుగోలు చేస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. సాహిత్య సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000