తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Unlucky Zodiac Signs: 18 ఏళ్ల తర్వాత కలిసిన రెండు గ్రహాలు- ఈ మూడు రాశుల జీవితంలో సమస్యలు కలిగిస్తాయి

Unlucky zodiac signs: 18 ఏళ్ల తర్వాత కలిసిన రెండు గ్రహాలు- ఈ మూడు రాశుల జీవితంలో సమస్యలు కలిగిస్తాయి

Gunti Soundarya HT Telugu

28 September 2024, 17:00 IST

google News
    • Unlucky zodiac signs: కన్యా రాశిలో సూర్య, కేతు గ్రహాల సంయోగం జరిగింది. ఈ రెండు గ్రహాలు సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్నాయి. వీటి ప్రభావంతో మూడు రాశుల వారి జీవితంలో సమస్యలు ఏర్పడనున్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. 
సూర్య కేతు సంయోగం
సూర్య కేతు సంయోగం

సూర్య కేతు సంయోగం

Unlucky zodiac signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెల రాశిని మారుస్తాడు. అలాగే ఇతర గ్రహాలతో సంయోగం కలిగి ఉంటాడు. సెప్టెంబరు 16న రాత్రి 07:29 గంటలకు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో కేతువు ఇప్పటికే సంచరిస్తున్నాడు.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

18 సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో సూర్యుడు, కేతువుల కలయిక జరుగుతోంది. 17 అక్టోబర్ 2024 వరకు సూర్యుడు ఈ రాశిలో ఉంటాడు. ఈ విధంగా అక్టోబర్ 17 వరకు కేతువు, సూర్యుడు కన్యా రాశిలో కలిసి ఉంటారు. సూర్యుడు గుర్తింపు, ఆకాంక్షను సూచిస్తాడు.. అయితే కేతువు అనేది వైరాగ్యం, గత జీవిత పరిణామాలకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అవి ఏ రాశులో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి సూర్య, కేతువు కలయిక ఇబ్బందులను కలిగిస్తుంది. ప్రస్తుతం చట్టపరమైన కేసులతో ఇబ్బంది పడుతుంటే ఈ కాలంలో మీరు వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి. కడుపు లేదా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మేష రాశి వారు బయట భోజనం చేయడం మానుకోవాలి. మీరు గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటే సకాలంలో మందులు తీసుకోండి. ఈ కాలంలో మీరు ఎవరికీ రుణం ఇవ్వకుండా ఉంటే మంచిది. లేదంటే వాటిని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి

సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. అందువలన వైవాహిక జీవితంలో ఈ కాలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. మీకు మీ భాగస్వామికి మధ్య సమన్వయ లోపం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. దీనివల్ల కుటుంబ శాంతికి విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. మీన రాశి వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. వారు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శని సడే సతి ప్రభావం కనిపిస్తుంది. డబ్బు, ఆరోగ్య విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి

సూర్యుడు, కేతువుల కలయిక కన్యా రాశికి చాలా హానికరం. ఈ కాలంలో ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. వ్యాపార వ్యక్తులు ప్రయాణానికి దూరంగా ఉండాలి. మీ ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు అదుపులో ఉంచుకోవాలి లేదంటే అది గొడవలకు దారి తీస్తుంది. పెట్టుబడికి ఇది అనుకూలమైన కాలం కాదు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలి. ఎవరితోనూ తగాదాలలో పాల్గొనవద్దు. సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం