శని దుష్ప్రభావాలు తగ్గించే నీలమణి- ఏ రాశి వారు ధరించవచ్చు? ఎవరు ధరించకూడదు?-consider the horoscope while wearing the neelam ratna know its benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని దుష్ప్రభావాలు తగ్గించే నీలమణి- ఏ రాశి వారు ధరించవచ్చు? ఎవరు ధరించకూడదు?

శని దుష్ప్రభావాలు తగ్గించే నీలమణి- ఏ రాశి వారు ధరించవచ్చు? ఎవరు ధరించకూడదు?

Gunti Soundarya HT Telugu
Sep 23, 2024 06:23 PM IST

నీలమణికి శనికి చెందిన రత్నంగా పరిగణిస్తారు. ఇది పెట్టుకోవడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి బయట పడొచ్చు. అయితే ఇది ఎలా ధరించాలి? ఎవరు ధరించాలి? ఏ రాశి వాళ్ళు ధరించకూడదో తెలుసుకుందాం.

నీలమణి ధరించడం వల్ల ప్రయోజనాలు
నీలమణి ధరించడం వల్ల ప్రయోజనాలు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలను శాంతింపజేయడానికి రత్నాలను ధరిస్తారు. శని గ్రహాన్ని శాంతింపజేయడానికి నీలమణిని ధరిస్తారు. ఈ రత్నాన్ని ధరించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది కాకుండా ఈ రత్నాన్ని ధరించిన వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప పురోగతిని సాధిస్తారు.

వజ్రం చాలా ఖరీదైనది. అది అందరికీ సొంతం కాలేదు. వజ్రం తర్వాత అంతటి ఖరీదు కలిగింది నీలమణి. నీలం రంగులో ధగధగలాడిపోయే ఈ మణిని ధరించడం వల్ల శని ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం బ్లూ నీలమణి రత్నాన్ని ధరించే ముందు జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రత్నం మీకు అననుకూలంగా ఉంటే మీరు ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే నీలమణి ఎవరు ధరించవచ్చు? ఏ రాశి వాళ్ళు ధరించకూడదు? అనే విషయాలు తెలుసుకుందాం.

నీలమణి ధరించడం వల్ల ప్రయోజనాలు

నీలం శుభం కలిగి ఉన్న వ్యక్తులు దాని ప్రయోజనాలను వెంటనే చూడటం ప్రారంభిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆర్థిక లాభాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ప్రారంభమవుతుంది. శని బలహీన స్థితిలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు.

అదే నీలమణి మీ జాతకానికి సరిపోలకపోతే దాని ప్రభావం వెంటనే పడుతుంది. నీలం రత్నం అశుభం అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నీలం అందరికీ శుభ ఫలితాలను ఇవ్వదు. ఇది శ్రేయస్కరం కాని వ్యక్తులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పెను ప్రమాదం సంభవించవచ్చు. సింహం, మీనం, ధనుస్సు రాశికి చెందిన వాళ్ళు నీలమణి పొరపాటున కూడా పెట్టుకోకపోవడమే మంచిది. వెండితో కలిపి ఈ రత్నం ధరించవచ్చు. ఇది పెట్టుకునే ముందు పాలు లేదా గంగా జలంతో శుద్ధి చేయాలి. అలాగే శని మంత్రాలు చదువుతూ దీన్ని ధరించడం ఉత్తమం.

నీలమణి సెట్ అవుతుందో లేదో ఇలా చూసుకోండి

నీలమణి రత్నాన్ని ధరించే ముందు దానిని దిండు కింద ఉంచి నిద్రించండి. మీకు రాత్రిపూట చెడు కలలు రాకుండా మంచి గాఢనిద్ర వస్తే ఈ రత్నం మీకు శుభప్రదమని అర్థం. మీకు మంచి, గాఢమైన నిద్ర లేకపోతే ఈ రత్నాన్ని ధరించకండి. రత్నాన్ని ధరించిన తర్వాత ఏదైనా అశుభకరమైన సంఘటన జరిగితే వెంటనే దానిని తొలగించండి.

ఎముకలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్న వాళ్ళు నీలమణి ధరించడం వల్ల సదరు వ్యాధులు త్వరగా నయం అవుతాయని నమ్ముతారు. ఇది ధరించిన 24 గంటల్లోనే దీని ప్రభావం చూపిస్తుంది. అయితే నీలమణి ధరించడానికి ముందు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలి. శని వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ రత్నం ధరించడం వల్ల మంచి జరుగుతుంది. ఏలినాటి శని, అర్థాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నీలమణి చక్కని పరిష్కార మార్గంగా ఉంటుంది.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.