Saturn transit: జాతకంలో శని ఈ స్థానంలో ఉంటే ఏలినాటి శని సమయంలోనూ ధనలాభాలు కలుగుతాయి-in this position of saturn in horoscope there is monetary gain even if there is elinati shani ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: జాతకంలో శని ఈ స్థానంలో ఉంటే ఏలినాటి శని సమయంలోనూ ధనలాభాలు కలుగుతాయి

Saturn transit: జాతకంలో శని ఈ స్థానంలో ఉంటే ఏలినాటి శని సమయంలోనూ ధనలాభాలు కలుగుతాయి

Gunti Soundarya HT Telugu
Aug 16, 2024 08:00 AM IST

Saturn transit: ఏలినాటి శని కాలం చాలా కష్టకాలంగా చెప్తారు. ఈ సమయంలో ఆర్థిక నష్టాలు సంభావిస్తాయని అంటారు. కానీ శని జాతకంలో ఈ స్థానంలో ఉంటే మాత్రం ఏలినాటి శని కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. మీకు ఎటువంటి ధన కొరత ఉండదు. జీవితం సాఫీగా సాగిపోతుంది.

శని ఈ స్థానంలో ఉంటే మీకు ఆర్థిక లాభాలే
శని ఈ స్థానంలో ఉంటే మీకు ఆర్థిక లాభాలే

Saturn transit: శనీశ్వరుడు నీచ స్థానములో ఉండుటకు, శని ఉచ్చస్థితిలో ఉండుటకు చాలా తేడా ఉంది. శని మీ రాశిలో బలహీనంగా ఉంటే మీ పని విజయవంతం కావడానికి సమయం పడుతుంది. అయితే మీ జాతకంలో శని ఉచ్ఛస్థితిలో ఉన్నట్లయితే చిన్న పని చేసినా ఎటువంటి కష్టం లేకపోయినా వెంటనే విజయం సాధిస్తారు.

శని నెమ్మదిగా కదిలే గ్రహం. కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు. శని శుభ స్థానంలో ఉంటే అనంతమైన ఫలితాలు కలుగుతాయి. శని నిదానంగా ఫలితాలను ఇస్తుందని, శిక్షను కూడా నిదానంగా ఇస్తుందని చెబుతారు. శని అందరికీ న్యాయం చేస్తాడు. ఒకరు చేసే పనుల ప్రకారం మాత్రమే ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు చెడు పనులు చేస్తే వాటికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. అదే మీ పనులు మంచిగా ఉంటే శని మీకు పట్టరాని సంతోషాన్ని ఇస్తాడు. అందుచేత శనిని చూసి భయపడాల్సిన పనిలేదు కర్మలను సరిదిద్దుకుంటే చాలు. అయితే జాతకంలో శని స్థానాన్ని పరిశీలించాలి.

ఆర్థిక నష్టం కలిగిస్తుంది

శని మీ జాతకంలో బలహీనంగా ఉంటే శని మీకు ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాదు. బదులుగా అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు శని నీతిమంతుడు అని చెప్పినప్పుడు క్రమంగా పనులు మంచిగా ఉంటేనే లాభాలు కలుగుతాయి.

సాధారణంగా ఏలినాటి శని కష్టాల కాలం అంటారు. ఏడున్నర సంవత్సరాల పాటు మూడు దశలలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కష్టాలు, ఆర్థిక నష్టాలు, సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెడతాయి. కానీ ఈ సమయంలో కూడా శని మీ జాతకంలో మూడవ, ఆరు, పదకొండవ ఇంట్లో ఉంటే అప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా మీకు హాని కలిగించదు. ఏలినాటి శని సమయంలో మీకు విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. జాతకుని ఈ స్థానంలో శని మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాడు. అది ఏలినాటి శని దశ అయినా లేదంటే శని మహాదశ అయినా శని మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

ఏ రాశిలో శని క్షీణించి ఉంటాడు

కుంభ, మకర రాశులకు అధిపతి. అందుకే వీరికి ఆర్థిక కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. వీరి మీద శని చల్లని చూపు ఉంటుంది. మేష రాశిలో శని బలహీనంగా ఉంటాడు. సూర్యుడు ఎక్కువగా ఉన్న చోట శని తక్కువగా ఉంటాడు. ప్రస్తుతం శని, సూర్యుడు ఎదురెదురుగా ఉన్నారు. దీని వల్ల సంసప్తక యోగం ఏర్పడింది. ఈ సమయంలో దీని ప్రభావం పొందే వాళ్ళు సోమరితనం విడిచిపెట్టాలి. ఈ వ్యక్తులు విజయం అంత తేలికగా దక్కకపోవచ్చు. దీని కోసం మీరు చాలా కష్టపడాలి. ఒకరి శ్రమను సద్వినియోగం చేసుకోకండి. మీ కింద పనిచేసే వారిని సంతోషంగా ఉంచుకోండి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.