Kumbha rashi: ఏలినాటి శని ప్రభావం.. ఇంకో నాలుగేళ్ళు కుంభ రాశి వారికి కష్టాలు తప్పవు-elinati shani effect next four years kumbha rashi people face troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kumbha Rashi: ఏలినాటి శని ప్రభావం.. ఇంకో నాలుగేళ్ళు కుంభ రాశి వారికి కష్టాలు తప్పవు

Kumbha rashi: ఏలినాటి శని ప్రభావం.. ఇంకో నాలుగేళ్ళు కుంభ రాశి వారికి కష్టాలు తప్పవు

Gunti Soundarya HT Telugu
Aug 08, 2024 02:25 PM IST

Kumbha rashi: ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉండటం వల్ల ఈ రాశికి ఏలినాటి శని రెండో దశ జరుగుతోంది. దీని ప్రభావం ఇంకో నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది. కుంభ రాశి వారికి దీని నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసుకుందాం.

కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం
కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం

Kumbha rashi: జ్యోతిష్య శాస్త్రంలో ఏలినాటి శని, అర్థాష్టమ శని చాలా అశుభంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో వీటి బారిన తప్పకుండా పడతారు. ఏలినాటి శని ప్రభావం మూడు దశలలో ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఏలినాటి శనిని సడే సతీ అని కూడా పిలుస్తారు.

జాతకంలో ఏలినాటి శని ఉంటే అధికంగా కష్టాలు వెంటాడతాయి. శని దేవుడు కర్మలకు అనుగుణంగా వ్యక్తికి శుభ, అశుభ ఫలితాలు ఇస్తాడు. ధర్మాన్ని ప్రేమించే శనీశ్వరుడు మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అదే చెడు, మోసపూరిత పనులు చేస్తే మాత్రం జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని అనుగ్రహం కురిపిస్తే మనిషి జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. అదే శని అనుగ్రహం లేకపోతే మాత్రం జీవితం కష్టాలతో నిండిపోతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం శని 2023 జనవరి 17 నుంచి కుంభ రాశిలో కూర్చున్నాడు. 2025 మార్చి 29 న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని సంచరించే రాశికి ముందు, వెనుక ఉండే రాశుల మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శని ఉంటున్న కుంభ రాశి వారికి సడే సతీ నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం.

కుంభ రాశి వారికి ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు?

2023 సంవత్సరంలో శని కుంభ రాశిలో కూర్చోవడం వల్ల ఏలినాటి శని మకర, కుంభం, మీన రాశి పడుతోంది. అదే సమయంలో కర్కాటకం, వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని జరుగుతున్నాయి. 2025 లో మీన రాశిలో శని సంచారంతో మకర రాశి ప్రజలకు ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది.

అదే సమయంలో కుంభ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ కొనసాగుతోంది. మార్చి 29, 2025 న ఏలినాటి శని మూడవ దశ కుంభ రాశి కుంభ రాశి వారికి ప్రారంభం అవుతుంది. అటు మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది. 2027 జూన్ 3 వరకు కుంభ రాశి వారిపై శని వక్ర కన్ను ఉంటుంది. దీని తర్వాత శని మేష రాశిలో సంచరిస్తుంది. 2028 ఫిబ్రవరి 23 వరకు శని మేష రాశిలో సంచరిస్తాడు. ఈరోజు నుంచి కుంభ రాశి వారికి ఏలినాటి శని నుంచి సంపూర్ణ విముక్తి కలుగుతుంది.

ఏలినాటి శని దశలు ఎలా ఉంటాయి?

మొదటి దశ: ఏలినాటి శని మొదటి దశ ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు తలెత్తడంతో పాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

రెండవ దశ: శని సడే సతీ రెండవ దశ ఒక వ్యక్తి ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు మానసిక ఒత్తిడిని ఇస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో కష్టపడి పని చేసినప్పటికీ వ్యక్తి వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మూడవ దశ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సడే సతీ మూడవ దశ ఇబ్బందికరంగా ఉంటుంది. దీని వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. సౌకర్యాలు తగ్గడం ప్రారంభమవుతాయి. ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. కుటుంబ జీవితంలో కలహాల పరిస్థితి ఏర్పడుతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.