Lord shani: వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం.. రానున్న 7 నెలలు ఎలా గడుస్తుందో తెలుసా?-last 7 months of arthashtama shani on scorpio know what results shanidev will give till march 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shani: వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం.. రానున్న 7 నెలలు ఎలా గడుస్తుందో తెలుసా?

Lord shani: వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం.. రానున్న 7 నెలలు ఎలా గడుస్తుందో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Aug 13, 2024 02:19 PM IST

Lord shani: ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని జరుగుతోంది. వృశ్చిక రాశి వారికి శనిగ్రహ కోపం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? రానున్న ఏడు నెలలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు శని ఇవ్వబోతున్నాడో తెలుసుకోండి.

వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం
వృశ్చిక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం

Lord shani: శని గ్రహ సంచారం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో శని మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో శని సంచరిస్తున్నాడు.

కుంభ రాశిలో శని ఉండటం వల్ల కర్కాటక, వృశ్చిక రాశుల్లో అర్థాష్టమ శని(శని దయ్యా అంటారు) కొనసాగుతున్నాయి. శని రాశి మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి శని దయ్యా నుంచి వచ్చే ఏడాది విముక్తి లభిస్తుంది. వృశ్చిక రాశి వారు దాదాపు ఏడు నెలల పాటు అర్థాష్టమ శని ప్రభావంతో ఉంటారు. శనిగ్రహం ఎప్పుడు సంచరిస్తుందో తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి రానున్న నెలలు శనిదేవుడి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూద్దాం.

అర్థాష్టమ శని నుంచి విముక్తి ఎప్పుడు?

శని గ్రహం కుంభం నుండి బయటకు వెళ్లి మీన రాశిలోకి మార్చి 29, 2025న సంచరిస్తాడు. శని మీనంలోకి ప్రవేశించిన వెంటనే వృశ్చిక రాశి వారికి శని దయ్యా నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో అర్థాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశిపై సుమారు ఏడు నెలల పాటు ఉంటుంది. మీన రాశిలో శని ప్రవేశం వల్ల ధనుస్సు, సింహ రాశులపై అర్థాష్టమ శని ప్రభావం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక రాశిపై అర్థాష్టమ శని ప్రభావం రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. దీని వల్ల ఆయా రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

అర్థాష్టమ శని కొనసాగుతున్న వృశ్చిక రాశి వారికి శని రానున్న ఏడు నెలలు కొన్ని పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తాడు. శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు తమ ప్రేమ జీవితం, వృత్తి లేదా ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మార్చి 2025 నాటికి మీరు మీ ఇంటిని పునరుద్ధరించవచ్చు లేదా మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులను చూడవచ్చు.

మీరు భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఇనుము సంబంధిత పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఏ రకమైన రుణానికైనా ఈ సమయం మంచిది. రాజకీయాలకు దూరంగా ఉండండి లేకుంటే వివాదాల్లో ఇరుక్కోవచ్చు. శని ప్రభావం కారణంగా మీరు మీ కెరీర్‌లో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కొద్ది సమయం తరువాత సానుకూల మార్పులు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి సమయం. బాస్ లేదా సీనియర్లతో వాదనలకు దూరంగా ఉండండి.

శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పరిహారం

వృశ్చిక రాశి వారు శని దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి. శివ చాలీసా పఠించండి. చంద్ర బీజ్ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.