Hanuman chalisa: హనుమాన్ చాలీసా ఎలా చదివితే అద్భుత ఫలితాలు లభిస్తాయి-how to chanting hanuman chalisa for better results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Chalisa: హనుమాన్ చాలీసా ఎలా చదివితే అద్భుత ఫలితాలు లభిస్తాయి

Hanuman chalisa: హనుమాన్ చాలీసా ఎలా చదివితే అద్భుత ఫలితాలు లభిస్తాయి

Gunti Soundarya HT Telugu
Jul 06, 2024 01:30 PM IST

Hanuman chalisa: హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అద్భుతమైన మార్గం. అయితే ఈ చాలీసా ఎలా చదివితే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

Hanuman chalisa: హనుమంతుడు భక్తి, ధైర్యం, నిస్వార్ధ సేవకు ప్రతీక. అందుకే శ్రీరామచంద్రుడి పరమ భక్తుడు భగవంతుడు అయ్యాడు. శ్రీరామ నామం జపించిన ప్రతి చోటా తాను ఉంటానని హనుమంతుడు చెప్తాడు. సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకడు. ఇప్పటికీ భూమి మీద ఎక్కడో ఒక చోట ఉన్నాడని భక్తులు విశ్వాసం. తన భక్తులకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తూ, చెడు నుంచి రక్షణ కల్పిస్తూ, అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు.

హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభంగా చెబుతారు. స్వచ్ఛమైన మనసుతో శ్రీరాముడిని ధ్యానించి వ్యక్తి పట్ల సంతోషంగా ఉంటూ అతని ఆశీర్వాదాలు కురిపిస్తాడు. హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమమైన మార్గం. మంగళవారం రోజు ఉపవాసం ఉండి రామనామ జపం చేయాలి. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో హనుమంతుడు చేసిన పనుల గురించి ప్రశంసించే 40 శ్లోకాలు ఉన్నాయి. ఇది అత్యంత శక్తివంతమైన పవిత్రమైన చాలీసా. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అద్భుతాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు సరైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఎలా చదవాలి? ఉచ్చారణ ఎలా చేయాలి? అనే విషయాలు అర్థం చేసుకోవాలి. కష్టమైన పదాలను దాటవేయడం, తప్పుగా ఉచ్చరించడం, అర్థం తెలియకుండా చదవడం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు.

హనుమాన్ చాలీసా ఇలా చదవాలి

మొదటిగా ధ్యాన భంగిమలో కూర్చుని చేతులు ముందుకు చాచి వెన్నెముక నిటారుగా ఉండాలి. హనుమంతుడిని మనసులో ధ్యానించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యాన భంగిమలో కూర్చోవడం వల్ల మీ మనసు, మెదడు ఏకాగ్రతగా ఉంటుంది.

హనుమాన్ చాలీసాలోని మొదటి, చివరి శ్లోకాలను ఎప్పుడూ చదవకుండా దాట వేయకూడదు. మొదటిది "శ్రీ గురు చరణ్ సరోజ్ రాజ్" అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఇక ముగింపులో “పవన తనయ సంకట్ హరణ్” అని ఉంటుంది. ఈ రెండు దోహాలను ఎప్పుడూ చదవకుండా ఉండకూడదు. ఇవి హనుమంతుని శక్తి, ఆశీర్వాదాలను ప్రేరేపిస్తాయి. అందువల్ల వీటిని ఎప్పటికీ దాటవేయకూడదు. అలాగే చాలామంది మనసులో చదువుకునేందుకు ఇష్టపడతారు. కానీ మౌనంగా పారాయణం చేయడం మంచిదే అయినా హనుమాన్ చాలీసాను మాత్రం అలా పఠించకూడదు.

బిగ్గరగా జపించాలి

ప్రశాంతమైన వాతావరణంలో బిగ్గరగా చదవడం వల్ల మీ చుట్టూ సానుకూల శక్తి ప్రసరిస్తుంది. సమయం లేదని చాలామంది హనుమాన్ చాలీసాను ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే జపిస్తారు. కానీ హనుమాన్ చాలీసా ఎక్కువ సార్లు జపించాలని చెబుతారు. 100 సార్లు జపించిన వ్యక్తికి ఎటువంటి సమస్యలు ఉండవని, అడ్డంకులన్నీ తొలగిపోయి సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అపారమైన ఆనందాన్ని పొందుతారని చెబుతారు.

హనుమాన్ చాలీసా చదివేటప్పుడు చేసే సాధారణ తప్పు ఒకే పదాలు, వాక్యాలను పదేపదే చెబుతూ ఉంటారు. వాటి అర్థాలను తెలుసుకోకుండా చదువుతారు. కానీ అలా ఎప్పటికీ చేయకూడదు. పూర్తి అర్థం తెలుసుకుని స్పష్టంగా ఉచ్చరిస్తూ చదవాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేసే సమయంలో తులసీదాస్ పేరు స్థానంలో మీ పేరు పెట్టుకొని పఠించాలి. తులసీదాస్ సదా హరిచరా అని తెలిపే చోట మీ పేరు పలకాలి.

హనుమాన్ చాలీసా, మహా మృత్యుంజయ మంత్రాలను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. పిల్లల వయసు 4, 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వీటిని నేర్పించడం ఉత్తమం. అప్పుడే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు.

WhatsApp channel