తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sravana Masam: శ్రావణ మాసంలో ప్రతి అమ్మాయి ఆచరించాల్సిన నియమాలు ఇవి.. వీటిని ఎందుకు పెట్టారంటే

Sravana masam: శ్రావణ మాసంలో ప్రతి అమ్మాయి ఆచరించాల్సిన నియమాలు ఇవి.. వీటిని ఎందుకు పెట్టారంటే

Gunti Soundarya HT Telugu

14 August 2024, 13:42 IST

google News
    • Sravana masam: పవిత్రమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు ఆచరించడం ఉత్తమమని పెద్దలు సూచిస్తున్నారు. లక్ష్మీప్రదమైన ఈ మాసంలో పూజలు చేయడం వల్ల వాటి ఫలితం కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది. 
శ్రావణ మాసంలో ఆచరించాల్సిన నియమాలు
శ్రావణ మాసంలో ఆచరించాల్సిన నియమాలు

శ్రావణ మాసంలో ఆచరించాల్సిన నియమాలు

Sravana masam: పండుగలు, వ్రతాలు, నోములతో నిండిన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో ఏ ఇల్లు చూసినా దేవాలయం మాదిరిగానే కనిపిస్తుంది. ఎన్నో విశిష్టతలకు నెలవైన ఈ మాసంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా ఆచరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో శివారాధనకు విశేషమైన ఫలితాలు దక్కుతాయి. ఈ మాసంలో చేపట్టిన ఏ పూజ, యజ్ఞం, హోమం, నోములు ఏదైనా సరే దాని ఫలితం కొన్ని వేల రేట్లు అధికంగా ఇస్తుందని చెబుతారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ప్రాముఖ్యత ఉంటుంది. మంగళవారాలు మంగళ గౌరి దేవిని పూజిస్తారు. సోమవారం శివుడిని ఆరాధిస్తారు. రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తారు.

ఇక ఈ మాసంలో వచ్చే అత్యంత శ్రేష్ఠమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఆగస్ట్ 16న జరుపుకోనున్నారు. వరలక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ కొత్తగా పెళ్ళైన దంపతుల ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల సకల సుఖాలు, భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం.

ఆచరించాల్సిన నియమాలు

శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా అవలంభించడం చాలా అవసరమని పండితులు సూచిస్తున్నారు. చేతికి గాజులు వేసుకోవడం, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం, కళ్లకు కాటుక ధరించడం, తలలో పూలు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ ఐదు ఆచారాలు పాటించమని చెప్పడం వెనుక లోతైన అర్థం ఉందని అంటారు.

శరీరంలోని ఈ భాగాలన్నీ ప్రధాన చక్రాలుగా పిలుస్తారు. చేతికి మట్టి గాజులు ధరించాలి. అలాగే నుదుట స్టికర్స్ వంటివి కాకుండా కుంకుమ బొట్టు ధరించాలి. వేగినస్ అనే నరం గుండెలో ఆరంభమైన శరీరం మొత్తం ఉంటుంది. ఈ నరాన్ని రక్షించడం ఇవన్నీ చేయాలని చెబుతారు. దేహంలోని ఈ శరీర భాగాలు ఉద్రేకభరితం కాకుండా ఆనందంగా ఉంచడం కోసం వీటిని ధరించాలని చెబుతారు. అలాగే ఇవి ప్రతి ఆడపిల్లకు అందాన్ని ఇస్తాయి.

లక్ష్మీప్రదమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేయడం మంచిది. నిత్యం శివనామస్మరణ చేయడం ఉత్తమం. మహా మృత్యుంజయ మంత్రం, శివ మంత్రాలను పఠించడం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి.

శ్రావణ మాసంలో చేయకూడని పనులు

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ ఈ ఆచారాలు పాటించడం లేదు. కేవలం పండుగ, వ్రతం చేసుకుంటున్న రోజు మాత్రమే చక్కగా అందంగా ముస్తాబు అవుతున్నారు. కానీ అది ఏదో నామ మాత్రపు అలంకరణ మాత్రమే అవుతుందని అంటారు. అలాగే ఈ పవిత్రమైన మాసం మొత్తం దైవ నామ స్మరణకు కేటాయించాలి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తీసుకోవడం చేయకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మనసు దైవం మీద లగ్నం అవుతుంది.

అలాగే మద్యపానం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి తినడం కూడా నివారించాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. తప్పనిసరిగా ఉపవాసం ఆచరించాలి. అలాగే కాంస్య పాత్రలో ఆహారం తినకూడదు. కోపం, ఆవేశం, ఎదుటి వారిని దూషించడం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు.

తదుపరి వ్యాసం