Sravana sukravaram: శ్రావణ శుక్రవారం వైభవం.. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చే లక్ష్మీఅష్టకం స్తోత్రం
Sravana sukravaram: శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి. ఈరోజు ప్రాముఖ్యత ఏంటి? లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు పఠించాల్సిన లక్ష్మీఅష్టకం స్తోత్రం గురించి ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
Sravana sukravaram: శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రవణా నక్షత్రం శ్రీ మహా విష్ణువు నక్షత్రం. అటువంటి నక్షత్రం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదిగా పెద్దలు తెలియజేసినట్టుగా చిలకమర్తి తెలిపారు.
అలాంటి శ్రావణ మాసాలలో శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించినటు వారికి, ఆరాధించినటు వారికి అమ్మవారి అనుగ్రహం చేత ధన, కనక, వస్తు, వాహనాలు సిద్ధిస్తాయని చిలకమర్తి తెలిపారు. రుణ బాధలు పడేటువంటి వారికి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు, స్వగృహం లేని వాళ్ళు, సొంత ఇంటి కోసం ప్రయత్నం చేసే వారికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్త కోరికలు నెరవేరతాయని చిలకమర్తి తెలిపారు.
శ్రావణ శుక్రవారాల్లో తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య భాగాలలో విశేషంగా పూజా మందిరం వద్ద ఒక పీటను వేసి అమ్మవారిని స్థాపన చేసి లక్ష్మీదేవిని పూజించినటువారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు ధూప, దీప నైవేద్యాలతో షోడశ ఉపచారాలతో, అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించనటువంటి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి అమ్మవారిని పాలతో అభిషేకించడం చేత విశేషమైన ఫలితాలు లభిస్తాయి. పాలు, పరమాన్నం, మిఠాయిలు వంటివి అమ్మవారికి నివేదన చేసి శ్రావణ శుక్రవారాలు పంచి పెట్టె వారికి అనుకున్న పనులు పూర్తవుతాయని చిలకమర్తి తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు శంకారాచార్యులు వారు అందించినటువంటి కనకాధార స్తోత్రం, లక్ష్మీ అష్టకం చదువుకున్న వారికి అలక్ష్మి ఉండదని వారికి ధన కనక వస్తు వాహనాలు చేత సుఖ సంతోషాలు పొందుతారని చిలకమర్తి తెలిపారు.
హిందూ స్థాన్ టైమ్ తెలుగు ప్రేక్షకుల కోసం శ్రావణ శుక్రవారాల్లో పఠించాల్సిన లక్ష్మీ అష్టకాన్ని అందజేస్తున్నాం.
లక్ష్మీఅష్టకం స్తోత్రం
ఓం నమోస్తేస్తు మహా మాయే శ్రీ పీఠే సురపూజితే|
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ||
నమస్తే గరుడా రూఢే డోలాసుర భయంకరీ |
సర్వ పాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే||
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరీ |
సర్వ దుఃఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||
సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయినీ |
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ||
ఆద్యన్త రహితే దేవిఈ ఆది శక్తి మహేశ్వరీ |
యోగజ్ఞే యోగా సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తీ మహోదరే|
సర్వపాప హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||
పద్మాసన స్థితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ |
పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే||
శ్వేతాంబరధరే దేవీ నానాలంకార భూషితే|
జగత్ స్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యఃపఠేద్భక్తి మాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏక కాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యఃపఠేన్నిత్యం ధన్ ధాన్య సమన్విత ః||
త్రికాలం యఃపఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ||