శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కూడా ఆనవాయితీ, ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణమాసం ఎప్పటి నుంచి మొదలవుతోంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వంటి వివరాలు తెలుసుకుందాం.