తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీరు చేసే తప్పులను బట్టి నరకంలో మీకు పడే శిక్షలు ఇవే, ఏ తప్పుకు ఏ శిక్ష అంటే

మీరు చేసే తప్పులను బట్టి నరకంలో మీకు పడే శిక్షలు ఇవే, ఏ తప్పుకు ఏ శిక్ష అంటే

Gunti Soundarya HT Telugu

04 October 2024, 11:22 IST

google News
    • తప్పులు, పాపాలు చేసే వాళ్ళు నరకానికి వెళ్తారని అంటారు. అయితే నరకంలో ఎలాంటి తప్పులకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా? అవి ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసా? వీటి గురించి హిందూ గ్రంథాలలో వివరించారు. 
నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారో తెలుసా?
నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారో తెలుసా? (pinterest)

నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారో తెలుసా?

కుంభీ పాకం, అంధకూపం శిక్షలు అనగానే అపరిచితుడు సినిమాలో శిక్షలు గుర్తుకు వచ్చాయా? తప్పు చేసే వాళ్ళకు పురాణాల ప్రకారం ఉన్న శిక్షలు అని హీరో అందరికీ వేస్తుంటాడు. అయితే అవి ఏదో సినిమా కోసమని చేసిన కల్పిత శిక్షలు కావండోయ్. నిజంగానే ఉన్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

పాపాలు చేస్తే నరకానికి వెళ్తారని పెద్దలు అనడం వింటూనే ఉన్నారు. అటువంటి వాటిలో ఇవి కొన్ని. మరణం అనంతరం వ్యక్తి చేసిన ఖర్మలకు అనుగుణంగా నరకం, స్వర్గానికి వెళ్తారని అంటారు. నరకంలో శిక్షలు భయంకరంగా ఉంటాయి. వీటి గురించి హిందూ గ్రంథాలలో స్పష్టంగా వివరించారు. వాటి ప్రకారం నరకం అంటే ఒకటే శిక్ష అనుకునేరు. మనిషి చేసే పాపాలకు అనుగుణంగా ఉండే శిక్షలు ఏవో తెలుసుకుందాం.

తమిస్ర

ఇది పూర్తి చీకటితో కూడిన నరకం. ఇతరుల నుంచి సంపద, వారి కష్టార్జితం దోచుకునే వ్యక్తులు ఇందులోకి వెళతారు. ఇక్కడ యమ భటులు వాళ్ళను తాళ్లతో బంధించి కొడుతూ ఉంటారు. ఈ నరకంలోని ఆత్మలు తీవ్ర, మానసిక, శారీరక వేదన అనుభవిస్తారు.

అంధతమిశ్ర

అంధతమిశ్ర అనేది తమిస్రకు మించి ఉంటుంది. ఇక్కడ దోషులు అంధులుగా మారిపోతారు. తమ జీవిత భాగస్వామిని లాభాల కోసం ఉపయోగించుకునే పురుషులు లేదా స్త్రీ వేరొకర్లు ఆస్తులను అనుభవిస్తున్న వాళ్ళు ఇందులో ఉంటారు. జీవితంలో నీతివంతమైన ఎంపికలు చేయడంలో విఫలం అయిన వాళ్ళు దీనికి చేరుకుంటారు.

రౌరవ

ఇతరులను మోసం చేసే వాళ్ళు, వారి వస్తువులను లాగేసుకునే వాళ్ళు రౌరవానికి గురవుతారు. మోసం చేసే వ్యక్తులు రురు అనే సర్ప రూపాన్ని పొందుతారు. వారిని పాములు చుట్టుముట్టి నిరంతరం కాటు వేస్తూ నిరంతరం హింసలు పెడతారు. వీళ్ళ చేతిలో మోసపోయిన బాధితుల వేదన ఎలా ఉంటుందో వీరికి తెలిసి వచ్చేలా చేస్తారు.

మహారౌరవ

రౌరవ మాదిరిగానే, మహారౌరవ ఇంకా భయంకరంగా ఉంటుంది. తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించిన వాళ్ళకు ఈ శిక్ష పడుతుంది. ఈ నరక రాజ్యంలో క్రవ్యాద అని కూడా పిలిచే రురు జీవులు వారి మాంసాన్ని తింటూ హింసిస్తారు.

కుంభీపాక

కుంభీపాక నరకాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆత్మలను మరిగే నూనెలో వేసి వండుతారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. సజీవంగా ఉండే జంతువులను చంపి వాటికి హాని చేసే వారికి కుంభీపాకానికి గురవుతారు.

కళాసూత్రం

పెద్దలు, పిల్లలను అగౌరవపరిచే వ్యక్తులను వారి మరణాంతరం ఈ శిక్షకు గురవుతారు. బ్రాహ్మణులను అగౌరవపరిచే వాళ్ళు ఇందులోకే వెళతారు. అక్కడ చాలా వేడి ఉష్ణోగ్రతలో పరిగెత్తించి హింసిస్తారు.

అసిపత్రవన

సొంత వారి బాధ్యతలు విడిచి ఇతరుల కోసం పనులు చేసే వారికి ఈ శిక్ష పడుతుంది. ముళ్ల మూలికలతో చేసిన కొరడాతో కొట్టి కొట్టి హింసిస్తారు. కనీసం కనికరం కూడా లేకుండా వెంబడించి కొరడాలతో కొడతారు. వాళ్ళు అపస్మారక స్థితిలోకి జారుకున్నప్పటికీ లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళను మరింత బాధకు గురి చేస్తారు.

శుకరముఖ

ఇది ప్రత్యేకంగా నాయకుల కోసం ఉండే నరకం. అధికారంలో వచ్చిన తర్వాత వాగ్ధానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి తమ విధులను విస్మరించి దుష్పరిపాలన చేసే వారిని ఈ నరకంలో వేసి శిక్షిస్తారు. యమ భటులు దారుణంగా హింసలకు గురి చేస్తారు.

అంధకూపం

తమ దగ్గర సహాయం చేసేంత స్థోమత ఉన్నప్పటికీ ఇతరులకు సాయం చేసేందుకు నిరాకరించే వ్యక్తులు ఈ అంధకూపానికి వెళతారు. ఇక్కడ జంతువులు, కీటకాలు వీళ్ళను హింస పెడతాయి. తమ రాజ్యంలో వారి కాలం ముగిసే వరకు నిరంతరం కీటకాలు, జంతువులు కాటు వేస్తూనే ఉంటాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం