తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా?

సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా?

HT Telugu Desk HT Telugu

22 May 2023, 15:52 IST

    • సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా? ఎప్పుడు చేయాలి? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
సాయంత్రం దీపం వెలిగించే ముందు స్నానం చేయాలి?
సాయంత్రం దీపం వెలిగించే ముందు స్నానం చేయాలి? (pexels)

సాయంత్రం దీపం వెలిగించే ముందు స్నానం చేయాలి?

సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతుంది. రెండుపూటలా స్నానం చేయడం మంచిదే. సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయానికి కాస్త ముందుగా దీపం పెట్టడం తప్పనిసరిగా చేయాలి.

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

ఉదయం అయితే స్నానం చేస్తారు. శుచిగా ఉంటారు. కానీ సాయంకాలం అయ్యే సరికి స్నానం చేయాలా అన్న సందేహం కలుగుతుంది. పగలు పూర్తయ్యేటప్పుడు సూర్యుడు తన తేజస్సును అగ్నిలో పెట్టి వెళతాడని విశ్వాసం. అందుకే సూర్యాస్తమయ సమయానికి దీపం పెడితే సూర్య తేజస్సు అందులో ఉంటుందని విశ్వాసం.

దైవ కార్యం చేసేటప్పుడు శుచిగా ఉండాలి. అశౌచ్యం లేకుండా సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి, ఎక్కడా తిరగకుండా శుచిగా ఉన్నప్పుడు స్నానం ఆచరించాల్సిన పనిలేదు. కాళ్లూ చేతులు కడుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ కాలకృత్యాలకు వెళ్లి ఉంటే ఉతికిన దుస్తులు ధరించాలి. ఈ సమయంలో తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. స్త్రీలైతే కంఠస్నానం సరిపోతుంది.

సాయంత్రం దీపం వెలిగించి ఇష్ట దేవత ప్రార్థన చేయాలి. నేర్చుకున్న శ్లోకాలను పారాయణం చేయాలి. దీపారాధన చేసే సమయంలో చెప్పాల్సిన శ్లోకం ఇక్కడ చూడండి.

దీపారాధన శ్లోకం

దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం

బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్

శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్

జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్

సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే

టాపిక్