తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సంకట నాశన గణేశ స్తోత్రం.. రోజూ 4 సార్లు చదివితే కష్టాల నుంచి విముక్తి

సంకట నాశన గణేశ స్తోత్రం.. రోజూ 4 సార్లు చదివితే కష్టాల నుంచి విముక్తి

HT Telugu Desk HT Telugu

07 June 2023, 8:52 IST

    • సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతి నిత్యం నాలుగు సార్లు చదివితే ఎంతటి సంకటమైనా హరించుకుపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు జూన్ 7, 2023న సంకట నాశన గణేశ చతుర్థి. అందువల్ల మీరూ ఆ గణేశుడిని ప్రార్థించండి.
ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో కొలువైన గణేశుడు
ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో కొలువైన గణేశుడు

ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో కొలువైన గణేశుడు

సంకటం అంటే కష్టం. నాశనం అంటే నాశనం చేయడం. అంటే మనకు వచ్చే కష్టాన్ని నాశనం చేయడానికి, మనం చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. ఆ శ్లోకాల్లో ముందు వరుసలో ఉండేది సంకట నాశన గణేశ స్తోత్రం. ప్రతి రోజూ ఈ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదివితే మీ సకల కష్టాలు తొలగిపోతాయి. మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఎంతటి కష్టాన్నైనా బుద్ధిబలంతో జయించే శక్తి సమకూరుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతి సంకష్టి (సంకటహర) గణేశ చతుర్థి రోజు తప్పకచదవండి. ఆ వినాయకుడి కృపకు పాత్రలు కండి.

సంకట నాశన గణేశ స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్

భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్

 

సంకట నాశన గణేశ స్తోత్రం సమాప్తం. ఈ స్తోత్రాన్ని ప్రతి రోజూ 4సార్లు చదవండి. గణేషుడి ఆశీస్సులు పొందండి.