తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Radha Ashtami 2024: రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎప్పుడు వచ్చింది?

Radha ashtami 2024: రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎప్పుడు వచ్చింది?

Gunti Soundarya HT Telugu

10 September 2024, 17:11 IST

google News
    • Radha ashtami 2024: కృష్ణాష్టమి జరుపుకున్న పదిహేను రోజులకు రాధాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది రాధాష్టమి సెప్టెంబర్ 11వ తేదీ వచ్చింది. ఈరోజు రాధా రాణిని పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయి. తమ సంసార జీవితం బాగుండాలని కోరుకుంటూ వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. 
రాధాష్టమి విశిష్టత
రాధాష్టమి విశిష్టత

రాధాష్టమి విశిష్టత

Radha ashtami 2024: హిందూ సనాతన ధర్మంలో రాధా అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాధారాణి జన్మదినాన్ని భాద్రపద మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. రాధా అష్టమి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి లాగానే ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున రాధా రాణిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని భక్తుల విశ్వాసం.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

రాధా రాణిని ఆరాధించడం వల్ల మనిషికి సుఖం, ఐశ్వర్యం, సంపద లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పండుగ కృష్ణ జన్మాష్టమి తర్వాత 15 రోజులకు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శుక్ల పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 10 రాత్రి 11:11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 11 రాత్రి 11:46 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11న రాధా అష్టమి పండుగను జరుపుకుంటారు.

ఈ రోజున వివాహిత స్త్రీలు పిల్లల సంతోషం, భర్తతో శాశ్వతమైన బంధం నిలవాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు. పురాణాల ప్రకారం రాధాష్టమి రోజు రాధా రాణిని పూజించి సంతోషపెట్టేవారు. రాధను పూజించిన వారికి కృష్ణుడి ఆశీర్వాదాలు కూడా దక్కుతాయని చెబుతారు. ఈ ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు. రాధా రాణి లేకుండా శ్రీ కృష్ణుని ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది. రాధ ప్రేమ, ఆరాధన లేనిదే కృష్ణుడు లేడు. అందుకే రాధాకృష్ణుడు అని అంటారు. కృష్ణ జన్మాష్టమి లాగా రాధా అష్టమి పండుగను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

శుభ సమయం

పూజకు శుభ సమయం - 11:05 AM నుండి 13:32 PM వరకు

వ్యవధి - 02 గంటలు 26 నిమిషాలు

అష్టమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 10, 2024న రాత్రి 11:11

అష్టమి తిథి ముగుస్తుంది: సెప్టెంబర్ 11, 2024న రాత్రి 11:46

రాధా అష్టమి ప్రాముఖ్యత

రాధా అష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి. పిల్లల నుండి ఆనందం, సంతోషం లభిస్తుంది. రాధా అష్టమి అనేది లక్ష్మీ దేవి అవతారమైన రాధా రాణి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ప్రతిష్టాత్మకమైన హిందూ పండుగ. స్వచ్ఛమైన ప్రేమ, భక్తి స్వరూపులుగా పిలువబడే రాధకు శ్రీకృష్ణుడితో ఉన్న లోతైన అనుబంధం ఆమెను నిస్వార్థ అంకితభావానికి చిహ్నంగా చేస్తారు.

పూజా విధానం

భక్తులు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే నిద్రలేచి పూజ ప్రారంభించే ముందు పవిత్ర స్నానం ఆచరించాలి. ఇల్లు, పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయండి. రాధాకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం విగ్రహాలకు అందమైన బట్టలు, ఆభరణాలు, తాజా పువ్వులతో అలంకరించండి.

ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు, స్వీట్లతో పాటుగా భోగ్ ప్రసాదాన్ని అందించండి. రాధా దేవికి మేకప్ వస్తువులను సమర్పించి ఆమె ఆశీస్సులు కోరండి. వేద మంత్రాలు, శ్లోకాలను పఠించండి. రాధా గాయత్రీ మంత్రం పఠించడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాధా కృష్ణ ఆలయాలను సందర్శించండి. రాధా దేవికి ప్రార్థనలు చేయండి. సాయంత్రం అమ్మవారికి భోగ్ ప్రసాదం సమర్పించిన తర్వాత మీ ఉపవాసాన్ని ముగించండి. ఈ రోజున దానధర్మాలు చేయడం, పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం.

గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు లౌకిక విశ్వాసాలపై ఆధారపడింది, ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అందించబడింది.

తదుపరి వ్యాసం