తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పాతాళ సెంబు మురుగన్ దేవాలయం ప్రాశస్త్యం -బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే

పాతాళ సెంబు మురుగన్ దేవాలయం ప్రాశస్త్యం -బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే

HT Telugu Desk HT Telugu

03 December 2024, 6:00 IST

google News
    • Pathala Sembu Murugan Temple: శివపార్వతుల తనయుడైన కుమారస్వామికి తమిళనాడులో ప్రత్యేకమైన ఆలయం ఒకటి ఉంది. రామలింగపట్టి పాతాళ సెంబు మురుగన్ దేవాలయం ప్రాశ్యస్తంతో పాటు అక్కడి ప్రత్యేకల గురించి తెలుసుకుందాం.
పాతాళ సెంబు మురుగన్
పాతాళ సెంబు మురుగన్

పాతాళ సెంబు మురుగన్

తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగంపట్టిలో ఉన్న పాతాళ సెంబు మురుగన్ దేవాలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రసిద్ధ క్షేత్రం. ఈ ఆలయం పళని మురుగన్ దేవాలయానికి సమీపంలో పశ్చిమ కనుమల పర్వతాల మధ్య భూగర్భ గర్భాలయంలో ఉంది. ప్రధాన దేవత పాతాళ సెంబు మురుగన్. భక్తులు ఈ ఆలయాన్ని శ్రేయస్సు, ఆరోగ్యం, రక్షణ కోసం దర్శిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Suzuki Jimny: 2024 థాయ్ లాండ్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో మెరిసిన సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ ఎడిషన్

Dec 04, 2024, 05:55 PM

2024 Honda Amaze: స్టన్నింగ్ లుక్స్, గ్రేట్ ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి 2024 హోండా అమేజ్ లాంచ్

Dec 04, 2024, 05:38 PM

Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Dec 04, 2024, 05:30 PM

ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

Dec 04, 2024, 04:12 PM

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Dec 04, 2024, 02:25 PM

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Dec 04, 2024, 02:10 PM

పాతాళ సెంబు మురుగన్ దేవాలయ ప్రాశస్త్యం:

ప్రతిమ: పాతాళ సెంబు మురుగన్ ప్రతిమ భూమిలో 16 అడుగుల లోతులో గర్భగుడిలో ఉంది. భక్తులు 18 మెట్లు దిగితే గాని గర్భాలయంలోకి చేరలేరు.

నవపాషణ విగ్రహం:విగ్రహం ఔషధ గుణాలు కలిగిన నవపాషణం అనే పదార్థంతో సిద్ధర్ భోగర్ చేత నిర్మించబడింది. ఇది ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రసిద్ధి చెందింది.

కరుంగళి మాలల ప్రాముఖ్యత: ఈ ఆలయంలో అభిషేకించిన కరుంగళి మాలలను భక్తులు ధరిస్తే, శరీరం నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, శ్రేయస్సు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పురాణగాధలు: సిద్ధర్ భోగర్ మహర్షి పళని మురుగన్ విగ్రహాన్ని తయారు చేసినట్లు పురాణం చెబుతుంది. ఆయన తపస్సు, ఔషధ గుణాల జ్ఞానం ద్వారా మురుగన్ విగ్రహాన్ని నవపాషణంతో నిర్మించి, పూజా విధానాలను స్థాపించారు. భోగర్ శిష్యుడు తిరుక్కోయిలూర్ సిద్ధర్ పాతాళ సెంబు మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.

గ్రహ దోష నివారణ: రాహు, కేతు, కుజ దోషాలు తొలగించబడతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఆరోగ్యం, శ్రేయస్సు: భక్తులు దేవుడి కరుణతో శారీరక, మానసిక ఆరోగ్యం పొందుతారు.

ప్రతికూల శక్తుల తొలగింపు: కరుంగళి మాల ధరించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం.

వివాహ, సంతాన సమస్యల పరిష్కారం: మురుగన్ స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన వారు వివాహ సమస్యలు, సంతాన సమస్యల పరిష్కారాన్ని పొందుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

విద్య, వృత్తి, ఆస్తి తగాదాలు: ఈ క్షేత్రంలో స్వామిని ప్రార్థించడం ద్వారా విద్య, వృత్తి, ఆస్తి తగాదాల్లో విజయం సాధించవచ్చని నమ్మకం.

ఆలయ ప్రత్యేకతలు:

పాతాళ సెంబు మురుగన్ ఆలయంలో 18 రకాల మూలికలతో తయారైన విభూతి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఇది వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుందని భక్తుల విశ్వాసం.ఇక్కడ ప్రతి రోజు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 41 రోజుల పాటు స్వామి పాదాల వద్ద ఉంచి, అభిషేకించిన కరుంగళి మాలలు స్వామి కరుణతో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయని, వాటిని ధరిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని భోగర్ సిద్ధాంతం చెబుతుంది. పాతాళ సెంబు మురుగన్ ఆలయం భక్తుల భక్తి, విశ్వాసాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు శ్రేయస్సు, ఆరోగ్యం, మోక్షం పొందుతారని విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం