Office Vastu Tips: ఆఫీసుల్లో ఈ మార్పులు చేశారంటే వ్యాపారంలో మిమ్మల్ని కొట్టేవారెవరూ ఉండరు
04 December 2024, 10:37 IST
- Office Vastu Tips: ఆఫీసుల్లో చేసే కొద్దిపాటి మార్పులు వ్యాపారంలో భారీ ఫలితాలు తెచ్చిపెడతాయట. సతమతమవుతున్న సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ఈ పరిష్కారాలు పాటించండి.
ఆఫీసులో వాస్తు చిట్కాలు
Office Vastu Tips: ఆఫీసుల్లో చేసే కొద్దిపాటి మార్పులు వ్యాపారంలో భారీ ఫలితాలు తెచ్చిపెడతాయట. సతమతమవుతున్న సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ఈ పరిష్కారాలు పాటించండి.
లేటెస్ట్ ఫోటోలు
ఎవరైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు మంచి చెడులు చూసుకుని పనిలోకి దిగుతారు. కీడెంచి మేలెంచమన్నట్లు సాధ్యమైనంత వరకూ చెడు జరగకుండా ఉండేందుకే జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్నపాటి వ్యాపకాల నుంచి పెద్ద ఎత్తులో లాభాలు గడించాల్సిన వ్యాపారాల వరకూ వీటిని కచ్చితంగా పాటిస్తేనే మంచిదని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. వాస్తు శాస్త్రం విషయానికొస్తే మనం పని చేసే ప్రదేశాల్లో చిన్నపాటి మార్పులు చేస్తే పెద్ద మార్పులను చూడొచ్చు. వాస్తు సరిగా ఉంచుకోవడంతో పాటు మరిన్ని మార్పులు చేస్తే ఊహకందని రీతిలో లాభాలు చూడొచ్చు.
- వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ వ్యాపారాన్ని పెంచడానికి మీ ఆఫీసులో ఉత్తర దిశలో నీలం రంగు తామర చిత్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుందని బాగా నమ్ముతారు.
- తెలుపు రంగు పిగ్గీ బ్యాంకును ఉత్తరదిశలో ఉంచి, దానిపై కాయిన్ లేదా నోటు ఉంచితే శుభప్రదం. ఇలా చేయడం వల్ల కూడా వ్యాపారం వృద్ధి సాధిస్తుందనే భావన కనిపిస్తుంది.
- వ్యాపారాన్ని విస్తరించడం లేదా పెంచాలనుకునే వ్యక్తి రోజూ క్రమం తప్పకుండా తాను తీసుకునే ఆహారంలో నల్ల మిరియాలు వినియోగించాలి.
- వ్యాపారం పురోగతి సాధించడానికి, పుల్లని వస్తువులను కూడా జత చేర్చుకోవడం బెటర్. ఇలా చేయడం వల్ల మంచి లాభాలను చూడొచ్చు.
- వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి గురువారం రోజు ఆఫీసులోని ఈశాన్య మూలలో కాషాయ స్వస్తిక్ గుర్తును గీయించాలి.
- ఇక తాబేలు కూడా వాస్తులో కీలక పాత్ర వహిస్తుంది. ఇది లోహ రూపంలో ఉండే వాస్తు ప్రకారం చాలా శుభదాయకమైనదని చెబుతున్నారు. తాబేలు ఉంచడం వల్ల నిలిచిపోయిన పనులు పూర్వడమే కాక, కొత్త అవకాశాలు వస్తాయని కూడా నమ్మకం.
- ఆఫీసులో క్యాష్ కౌంటర్ లేదా డబ్బు దాచే ప్రదేశాన్ని ఉత్తర దిశలో ఉండేలా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల డబ్బు వచ్చే మార్గాలు అధికమవుతాయి. ఇంకా ఆ ప్రదేశంలో విఘ్నాలను తొలగించేందుకు వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి.
- డబ్బు ఉంచే ప్రదేశంలో లాఫింగ్ బుద్ద విగ్రహం లేదా కుబేరుని విగ్రహం ఉంచడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయట. వీటిని ఏర్పాటు చేయడంతో పాటు రోజూ శుభ్రపరిచి పువ్వును ఉంచి ఆరాధించాలి.
- వ్యాపార లావాదేవీలు జరిపే ఆఫీసులో ప్రతికూల శక్తుల ప్రభావం రాకుండా జాగ్రత్త పడండి. అన్నిమూలల్లోకి వెలుతురు చక్కగా పడేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. చెత్త అనేది లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకోండి.
- ఇంకా శక్తిని, ధనాన్ని ఆకర్షించే విధంగా ఉండేలా ఆఫీసులో ఫర్నీచర్ అనేది పసుపు లేదా కాంతివంతమైనదిగా ఉండాలి.
గులాబీ పుష్పాలు
- ఆఫీసులో గులాబీ పుష్పాలు, పచ్చని మొక్కలు ఉంచడం ఉత్తమం. ఇవి ఆఫీసులో ఫ్రెష్ ఎనర్జీని నింపి పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ మొక్కలను పడమర, దక్షిణ వైపులలో సీసాలలో ఉంచకూడదు.
- మరో కీలకమైన విషయం, మనం అస్సలు పట్టించుకోని విషయం ACలు. వీటిని ఉత్తర లేదా ఈశాన్య కోణంలో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
వాస్తు ప్రకారం, ఆఫీసులో ఉంచే వస్తువులు శక్తిని, సంపన్నతను, విజయం ఆహ్వానించేలా ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Vastu for Office, Office Vastu Tips, Vastu for Office Furniture, Vastu Guidelines for Business, Office Desk Vastu, ఆఫీసు వాస్తు, వాస్తు సూచనలు, ఆఫీసు ఫర్నిచర్ వాస్తు, వ్యాపార వాస్తు, ఆఫీసు డెస్క్ వాస్తు