తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 4, నేటి రాశి ఫలాలు- ఈరోజు వీరికి తోబుట్టువుల నుంచి లాభాలు కలుగుతాయి

అక్టోబర్ 4, నేటి రాశి ఫలాలు- ఈరోజు వీరికి తోబుట్టువుల నుంచి లాభాలు కలుగుతాయి

HT Telugu Desk HT Telugu

04 October 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.10.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 4  నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 4 నేటి రాశి ఫలాలు

అక్టోబర్ 4 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.10.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

వారం: శుక్ర‌వారం, తిథి : విదియ ,

నక్షత్రం: చిత్త , మాసం : ఆశ్వయుజం ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

రవి సంచారం వ‌ల్ల అత్యంత అనుకూలంగా ఉంది మేష రాశి వారి కాలం. శరీర ఆరోగ్యం బాగుంటుంది. గృహమున ఆనందోత్సవాలు తలబెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి వృద్ధి, గౌరవ మర్యా దలు పెరుగుతాయి. వ్యాపారంలో వృద్ధి ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్న‌త ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇష్ట దేవ‌తారాధ‌న మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

వృషభం

మిశ్ర‌మ ఫ‌లితాలు గోచ‌రిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. స‌మాజంలో పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. కొత్త విషయాలపై అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కొత్త కోర్సులలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రుడిని పూజించండి.

మిథునం

అనుకున్న ప‌నుల‌ను స‌మ‌యానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలను అధిగమిస్తారు. మీ బంధువులు, స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు. మానసిక ప్రశాంతతో ఆరోగ్యంగా కాలం గ‌డుపుతారు. అమ్మ‌వారిని ధ్యానించండి. మంచి జ‌రుగుతుంది.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఆదాయానికి మించి ప్రోత్సాహం కలుగుతుంది. తోబుట్టువుల నుండి కూడా కొన్ని లాభాలు పొందుతారు. పిల్లల విషయంలో వృద్ధి చెందుతారు. సంతోషకరమైన శుభవార్తను వింటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. కుటుంబీకుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. అమ్మ‌వారిని ధ్యానించండి. మ‌నోధైర్యం సిద్ధిస్తుంది.

సింహం

శుభవార్తలు వింటారు. ఆరోగ్యము మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఇది సరైన సమయం. వివాహ అవకాశాలు, వినోదం, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. మీ మాట‌కు మంచి గుర్తింపు ల‌భిస్తుంది. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి.

కన్య

సంపద పెరుగుతుంది. ఆనందంగా కాలం గడుపుతారు. విద్యార్థులు పోటీ ప‌రీక్ష‌ల్లో విజయం సాధిస్తారు. వివాహ అవకాశాలు క‌లిసి వ‌స్తాయి. వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో వృద్ధి పెరుగుతుంది. ఇతరులను శాసించాలనే దృక్పథం వీడితే సీనియర్లతో మరిన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ఆరాధించండి.

తుల

మీ ప్రాముఖ్యత అవసరాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయంగా ఎదుగుదలకు మంచి సమయం. స్థానిక సమస్యలకు న్యాయస్థానమును ఆశ్రయిస్తారు. వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కొన్ని స‌మ‌స్య‌లు రావ‌చ్చు. జాగ్ర‌త్త‌గా ఉండండి. ఇష్ట‌దేవ‌తారాధన శుభ‌ప్ర‌దం.

వృశ్చికం

ఆశయ సిద్ధి ఉంది. అప్పుల నుండి ఉపశమనము పొందే అవ‌కాశం ఉంది. ఆర్థిక స్థిరత్వానికి అవ‌కాశం ఉంది. అందరికీ ప్రయోజనకారిగా ఆదర్శంగా ఉంటారు. వస్తువ‌స్త్ర ఆభరణములను కొంటారు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త ప‌నికి రాదు. శివారాధ‌న శుభ‌ప్ర‌దం.

ధనుస్సు

మీరు పదిమందికి అండదండగా ఉంటూ కార్యజయం పొందుతారు. భార్య, తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుజ సంచారం దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన, అభిషేకం, ప్రదక్షిణలు చేయాలి. చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్నా అవ‌న్నీ తొల‌గిపోతాయి.

మకరం

ఉన్నతమైన ఆశయములే మిమ్ములను ముందుకు నడిపిస్తాయి. ఒక ఆహ్లాదకరమైన జీవనశైలికి ఆలవాటు పడతారు. బంధుమిత్రుల ప్రశంసలు అందుతాయి. కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. మంచిమిత్రుల అండ మీకుంటుంది. ఆనందంగా స‌మ‌యం గ‌డుపుతారు. ఆంజ‌నేయ స్వామి దండ‌కాన్ని ప‌ఠించండి.

కుంభం

చెడు సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో వివాదాల నుండి తెలివిగా తప్పించుకుంటారు. విద్యార్థులు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు. కృషి మరియు శ్రద్ధ అవసరాన్ని గుర్తిస్తారు. కుటుంబ‌స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డిపే కాలం ఇది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటే అంతా మంచి జ‌రుగుతుంది.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. వ్యాజ్యాల విషయాల్లో ఉపశమనం కనిపిస్తుంది. సంపాదన మెరుగుపడుతుంది. వాహనం, సంపద మరియు విలాసవంతమైన సౌకర్యాలతో జీవనశైలి సంపన్నంగా ఉంటుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం