Lakshmi narayana yogam: శుక్రుడి సంచారంతో లక్ష్మీ నారాయణ రాజయోగం- వీళ్ళు కెరీర్, వ్యాపారంలో దూసుకుపోతారు-mercury and venus conjunction create auspicious lakshmi narayana yogam in tula rashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Narayana Yogam: శుక్రుడి సంచారంతో లక్ష్మీ నారాయణ రాజయోగం- వీళ్ళు కెరీర్, వ్యాపారంలో దూసుకుపోతారు

Lakshmi narayana yogam: శుక్రుడి సంచారంతో లక్ష్మీ నారాయణ రాజయోగం- వీళ్ళు కెరీర్, వ్యాపారంలో దూసుకుపోతారు

Gunti Soundarya HT Telugu
Sep 17, 2024 03:32 PM IST

Lakshmi narayana yogam: శుక్రుడు రేపు అంటే సెప్టెంబర్ 18న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. వచ్చే నెల బుధుడు కూడా ఇదే రాశిలోకి వెళతాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల మూడు రాశుల వాళ్ళు కెరీర్, వ్యాపారంలో దూసుకుపోతారు. అవి ఏ రాశులో మీరు చూసేయండి.

లక్ష్మీ నారాయణ యోగం
లక్ష్మీ నారాయణ యోగం

Lakshmi narayana yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు నిర్ధిష్ట కాలం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి మారతాయి. గ్రహ సంచార సమయంలో గ్రహాల కలయిక కొన్ని శుభ యోగాలను సృష్టిస్తుంది. 18 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 01:42 గంటలకు శుక్రుడు తన స్వంత రాశిచక్రం తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఆ తర్వాత 10 అక్టోబర్ 2024న బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో 10 అక్టోబర్ 2024న తులా రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక ఉంది. కానీ ఈ సంయోగం శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి మారేంత వరకు ఉంటుంది. తులా రాశిలో శుక్రుడు, బుధుడి ఈ కలయిక లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది అన్ని రాశిచక్ర గుర్తుల స్థానికుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులు మాత్రం అత్యుత్తమ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

తులా రాశి

లక్ష్మీ నారాయణ రాజయోగం తుల రాశి లగ్న గృహంలో ఏర్పడుతుంది. ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితాల్లో శాంతి, ఆనందం ఉంటుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య మంచి అవగాహన ఉంటుంది. అందువల్ల మీ సంబంధం మెరుగుపడుతుంది. ఈ రాజయోగం వల్ల ఎలాంటి డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. ఉద్యోగరీత్యా శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. సమాజంలో అధిక గౌరవం లభిస్తుంది.

మకర రాశి

లక్ష్మీ నారాయణ రాజయోగం మకర రాశి కర్మ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవితంలోని వివిధ అంశాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో చాలా పురోగతిని అనుభవిస్తారు. వ్యాపారస్తులు ఈ కాలంలో చాలా డబ్బు సంపాదించగలరు. భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి కృషికి తగినట్టుగా కార్యాలయంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. యజమానితో సంబంధాలు మెరుగుపడటం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఇతర మంచి ఉద్యోగ ఆఫర్లను కూడా పొందవచ్చు. వ్యాపార వ్యక్తులు తమ కార్యకలాపాలను విస్తరించడం గురించి ఆలోచించవచ్చు.

కుంభ రాశి

కుంభ రాశి తొమ్మిదవ ఇంట్లో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ కాలం వీరికి చాలా అనుకూలమైనదిగా ఉంటుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ రంగంలో కూడా చాలా పురోగతి సాధించగలరు. ఈ సమయంలో మీరు కెరీర్‌లో ముందుకు సాగడానికి సహాయపడే అనుకూలమైన అవకాశాలను పొందవచ్చు. కెరీర్ పరంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది ఇప్పుడు అది నెరవేరుతుంది. దేశ విదేశాల్లో విహారయాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.