Hanuman chalisa: భక్తి, బలం, బ్రహ్మ చర్యం, శ్రీరాముడి పట్ల ఆచంచలమైన ప్రేమకు ప్రతిరూపం హనుమంతుడు. ధైర్యాన్ని శక్తి ఇస్తూ భయాన్ని పోగొట్టే దేవుడిగా అందరూ కొలుస్తారు. హనుమంతుడికి అంకితం చేసినది హనుమాన్ చాలీసా. ఇది ఎంతో శక్తివంతమైనది. ఇందులో హనుమంతుడి జీవితం, స్వభావం, శక్తుల గురించి వివరించాలి.
ప్రతి ఒక్కరూ రోజుల్లో ఒక్కసారైనా ఆంజనేయుడిని తలుచుకోకుండా నిద్రపోరు. ఏవైనా పీడకలలు వచ్చినప్పుడు ధైర్యం కోసం హనుమంతుడి మంత్రాలు పఠిస్తారు. హనుమాన్ చాలీసా లోని శ్లోకాలు తప్పనిసరిగా చదువుకుంటూ ఉంటారు. వరుసగా వంద రోజుల పాటు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయని నమ్ముతారు. మీరు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుతారా? అయితే దీనికి సంబంధించిన కొన్ని సింపుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చూద్దాం.
మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా అయితే మీరు హనుమంతుడికి నిజమైన భక్తులే. మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా పఠిస్తున్నారని అర్థం. దైవం మీద మనసు లగ్నం చేసి ఏ చిన్న శ్లోకం నేర్చుకున్నా సరే అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నల సమాధానాలు చూద్దాం. మీరు అన్నీ కరెక్ట్ గా చెప్పారో లేదో చూసుకోండి.
టాపిక్