Mercury transit: మిథున రాశిలో బుధుడి సంచారం.. వీరికి వ్యాపారంలో నష్టాలు, రుణ భారం తప్పదు
13 June 2024, 18:00 IST
- Mercury transit: బుధుడు జూన్ 14 నుంచి మిథున రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి వ్యాపార పరంగా నష్టాలు, రుణ భారం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ రాశులకో చూద్దాం.
బుధుడి సంచారం
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొన్ని గంటల్లో రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బుధుడు జూన్ 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. తెలివితేటలు, వాక్కు, మేధస్సు వంటి వాటికి బుధుడు కారకుడు. జూన్ నెలలో బుధుడ సంచారం రెండు సార్లు జరుగుతుంది. జూన్ 14 మిథున రాశిలోకి వెళ్తే మళ్ళీ జూన్ 27న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
నవగ్రహాలలో వ్యాపారాన్ని ప్రభావితం చేసే ప్రధాన గ్రహాలలో బుధుడు ఒకటి. కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇస్తాడు. బుధుడు శుభ స్థానం ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో విజయం పొందుతారు. అదే జాతకంలో బుధుడు ఏడు లేదా చెడు స్థానంలో ఉంటే వ్యాపారస్తులకు అదృష్టం అండగా ఉండకపోవచ్చు. ధన, వ్యాపార నష్టం జరుగుతుంది.
బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏ రాశిలో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి మూడో ఇంట్లో బుధుడి సంచారం జరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. లేదంటే ధన నష్టం సంభవిస్తుంది. ఈ సమయంలో వివిధ కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలలో శత్రువులతో కఠినమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి ఎనిమిదో ఇంట్లో బుధ సంచారం జరుగుతుంది. ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశాలు ఉన్నాయి. స్వార్థపరులుగా ఆలోచిస్తారు. ఉత్సాహం కూడా తగ్గుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు కష్టపడినా లాభాలు పొందలేరు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో అసంతృప్తి అలుముకుంటుంది.
మకర రాశి
మకర రాశి ఆరో ఇంట్లో బుధ సంచారం జరుగుతుంది. ఈ సమయంలో వీరికి ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన లాభాలు లేకపోవడం వల్ల రుణాల మీద ఆధారపడతారు. వ్యాపారవేత్తలు పోటీదారులతో గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. కొన్ని సమయాల్లో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయే పరిస్థితి ఎదురవుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి ఐదో ఇంట్లో బుధుడి సంచారం జరుగుతుంది. ఈ కాలంలో అభివృద్ధి, పురోగతి తగ్గుదల ఉంటుంది. అష్టమ స్థానానికి బుధుడు అధిపతి అయినప్పటికీ ఐదో ఇంట్లో సంచరించడం వల్ల వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్వల్ప లాభంతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. పోటీదారుల నుంచి కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. స్టాక్ మార్కెట్, వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
మీన రాశి
మీన రాశి నాలుగో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. వ్యాపారస్తులు కొద్దిగా లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. ప్రత్యర్ధులు ఈ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తారు. వ్యాపారానికి సంబంధించి ఏవైనా పనులు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.