జూన్ 9, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడిని జయిస్తారు, బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కారం-june 9th 2024 today rasi phalalu in telugu check zodia wise results for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 9, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడిని జయిస్తారు, బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కారం

జూన్ 9, నేటి రాశి ఫలాలు.. ఒత్తిడిని జయిస్తారు, బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కారం

HT Telugu Desk HT Telugu
Jun 09, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ09.06.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 9వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 9వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 09.06.2024

వారం: ఆదివారం, తిథి : తదియ

నక్షత్రం : పునర్వసు, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన విషయాల్లో విజయం లభిస్తుంది. మంచి పనులు చేపడతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో అనందముగా గడుపుతారు. ధనయోగముంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు లాభిస్తాయి. అరోగ్యం అనుకూలిస్తుంది. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు శుభఫలితాలున్నాయి. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించండి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధి సాధిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. తోటివారితో కలసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు. మనోథైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడులుంటాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఎన్ని అటంకాలున్నా అనుకున్నది సాధిస్తారు. ఇతరులతో కలసి ఉండటం వలన ఇబ్బందులు తగ్గుతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్ణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుగారు. కీర్తి పెరుగుతుంది. మీమీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. తోటివారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే బద్దకాన్ని దరిచేరనీయకండి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. కృషికి తగ్గ ఫలితాలున్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఇతరులతో అచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులుంటాయి. ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. బంధువుల సహకారం ఉంటుంది. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నతి స్థితికి ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. అనవసర విషయాలను అతిగా ఆలోచించకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు. ఆత్మ విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధువులతో అభిప్రాయ బేధములు రాకుండా చూసుకోవాలి. అకారణంగా గొడవలు కలిగే సూచనలున్నాయి. శాంతంగా వ్యవహరించండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. ప్రారంభించిన పనులను దృఢ సంకల్పంతో పూర్తి చేయాలి. మీ ప్రతిభకు ప్రశంసలుంటాయి. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడుపుతారు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు తగిన ప్రతిఫలముంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి. ఎవరితో వాదోపవాదాలు చేయకండి. ఓర్పుతో వ్యవహరించండి. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. ప్రారంభించ బోయే పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో మీ అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందముగా గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి. విరోధులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త పనికిరాదు. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. మీ పనితీరుకు ప్రశంసలుంటాయి. ఊహించని ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్పూర్తి అవసరం. రుణ భారం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel