Bhadra raja yogam: భద్ర రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు.. వీరి తలరాతలు మారి విలాసవంతమైన జీవితం గడుపుతారు
Bhadra raja yogam: మరో మూడు రోజుల్లో బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల భద్ర రాజయోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల తలరాతలు మారి విలాసవంతమైన జీవితం గడపబోతున్నారు.
Bhadra raja yogam: జ్యోతిష లెక్కల ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి మరో మూడు రోజుల్లో ప్రవేశించబోతున్నాడు. తెలివితేటలు, జ్ఞానం, ఆరోగ్యం, ప్రతిభ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చే బుధుడు జూన్ 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.
జూన్ నెలలో బుధుడి సంచారం చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో బుధుడు రెండు సార్లు తన రాశిని మార్చుకుంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చుకోగల గ్రహంగా బుధుడికి పేరు ఉంది. ప్రతి పదమూడు లేదా పదిహేను రోజులకు ఒకసారి బుధుడు రాశిని మార్చుకుంటాడు. అలా మొదటగా జూన్ 14న మిథున రాశిలోకి వెళ్తే.. జూన్ 29వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
భద్ర రాజయోగం అంటే ఏంటి?
మిథున రాశిలో బుధుడి సంచారం శక్తివంతమైన భద్ర రాజయోగాన్ని సృష్టిస్తుంది. జాతకంలోని మొదటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో ఉన్నప్పుడు లేదా బుధుడు తన సొంత రాశి మిథునం లేదా కన్యా రాశిలో కూర్చున్నప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రంలో భద్ర రాజయోగాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. భద్ర రాజయోగం ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అపారమైన విజయం లభిస్తుందని నమ్ముతారు. సంపద, సౌభాగ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రతి రంగంలో పురోగతికి అనేక అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. జూన్ 14న భద్ర రాజయోగం ఏర్పడటంతో ఏ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధుడి సంచారం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. వీరికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగులతో పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు పెరుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ధన పరిమితులు కలుగుతాయి. వ్యాపారంలో లాభాలో ఉంటాయి. మాటతీరులో సౌమ్యత ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు శుభవార్త వింటారు.
కన్యా రాశి
గ్రహాల రాకుమారుడు బుధుడి సంచారంతో కన్యా రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. జూన్ 14 తర్వాత కెరీర్ లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. అనుకోకుండా ధనాన్ని పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఆశిస్తున్న వారికి శుభవార్త అందుతుంది.
తులా రాశి
భద్ర రాజయోగం తులా రాశి వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా అదృష్టకరమైన సమయం. పనులలో ఆటంకాలు తొలగుతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తుల నుంచి ధన లాభం పొందుతారు. అనేక పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బకాయి పడిన డబ్బు తిరిగి పొందుతారు.