అవిసె గింజలు (Flax Seeds) తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. అవిసె గింజలను ఆహారాల్లో వేసుకోవచ్చు. నేరుగా కూడా తినొచ్చు.
Photo: Pexels
అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా అనే సందేహం కొందరిలో ఉంటుంది. వేయిస్తే ప్రయోజనాల ఎలా ఉంటాయనే ప్రశ్న ఉంటుంది.
Photo: Pexels
అవిసె గింజలను వేయించుకొని తినవచ్చు. సన్నని మంటపై వేయిస్తే మంచిది. అవిసె వేయించుకొని తినడం వల్ల రుచిగా ఉండటంతో పాటు ప్రయోజనాలు కూడా మెండుగా అందుతాయి.
Photo: Pexels
అవిసె గింజల్లో ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో ఇవి తింటే మెదడు పని తీరు చురుగ్గా ఉంటుంది. విటమిన్ ఈ ఉండడం వల్ల ఇవి తింటే చర్మం, జుట్టుకు కూడా మేలు జరుగుతుంది.
Photo: Pexels
అవిసెల్లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే శరీరానికి మంచి శక్తి అందుతుంది. చురుగ్గా ఉండేలా తోడ్పడుతుంది.
Photo: Pexels
బరువు తగ్గేందుకు కూడా అవిసె గింజలు తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్‍లో ఉండేదుకు ఉపకరిస్తాయి. ఇవి తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి