Mars transit: మేష రాశిలో కుజుడు.. ఈ రాశుల వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కే ఘడియలు వచ్చేశాయి-mars transit in mesha rasi these zodiac signs get love marriage ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: మేష రాశిలో కుజుడు.. ఈ రాశుల వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కే ఘడియలు వచ్చేశాయి

Mars transit: మేష రాశిలో కుజుడు.. ఈ రాశుల వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కే ఘడియలు వచ్చేశాయి

Gunti Soundarya HT Telugu
Jun 04, 2024 12:50 PM IST

Mars transit: మేష రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి పెళ్లి, ప్రేమ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కుజుడి ప్రభావంతో ఈ రాశుల జాతకులు పెళ్లి పీటలు ఎక్కే ఘడియలు వచ్చాయి.

మేష రాశిలోకి కుజుడు
మేష రాశిలోకి కుజుడు (freepik)

Mars transit: వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు భయంకరమైన, ధైర్యవంతమైన గ్రహంగా భావిస్తారు. ఇది మండుతున్న గ్రహంగా చెప్తారు. మేష రాశిలో జూన్ 1 నుంచి కుజుడు తన ప్రయాణం ప్రారంభించాడు. జూలై 12వ తేదీ వరకు కుజుడు ఇదే రాశిలో ఉంటాడు . కుజుడి సంచారం ఒకరి జీవితంలోని అనేక అంశాలను ప్రత్యేకమైన రీతిలో ప్రభావితం చేస్తుంది. అంగారకుడు సంచారం వల్ల ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. కొన్ని రాశుల వారు తమ ప్రేమలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు.

yearly horoscope entry point

మేష రాశి

అంగారక సంచార సమయంలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతున్న రాశి చక్రాలలో మేష రాశి మొదటిది. ఈ రాశి మొదటి ఇంట్లో కుజుడి సంచారం జరుగుతుంది. ఫలితంగా ప్రేమ జీవితం, వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమ సంబంధాలు సంతోషాన్ని ఇస్తాయి. ఇద్దరూ సాన్నిహిత్యంగా మెలుగుతారు. ప్రేమికులు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

మిథున రాశి

కుజుడి సంచారం మిథున రాశి పదకొండో ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య సమన్వయం, పరస్పర అవగాహన చాలా బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది మాత్రమే కాకుండా ఇద్దరూ నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ కాలంలో ప్రేమ జీవితానికి సంబంధించి సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి ఐదు, పదో ఇంటికి కుజుడు అధిపతి. ఇప్పుడు కర్కాటక రాశి పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ప్రేమ జీవితం రొమాంటిక్ గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి .ఒకరితో ఒకరు సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ప్రేమికులు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్తారు.

సింహ రాశి

సింహ రాశి నాలుగు, తొమ్మిదో ఇంటికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రస్తుత సంచారం తొమ్మిదో ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితానికి వైవాహిక జీవితానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆనందకరమైన క్షణాలు గడుపుతారు.

వృశ్చిక రాశి

కుజుడు వృశ్చిక రాశి మొదటి, ఆరో ఇంటికి అధిపతి. ఇప్పుడు ఆరో ఇంట్లో సంచారం జరుగుతుంది. ఈ సమయంలో భాగస్వామితో పరస్పర సమన్వయం ఏర్పరుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమ ఆప్యాయతలను ఆస్వాదిస్తారు. లవ్ లైఫ్ కి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది.

మీన రాశి

మీన రాశి రెండు, తొమ్మిదో ఇంటికి కుజుడు అధిపతి. ఈ సంచారం రెండో ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా వైవాహిక జీవితం ఆనందంతో నిండిపోతుంది .ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాలలో సంతృప్తిగా ఉంటారు. ప్రేమికులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీకు మీ భాగస్వామికి మధ్య బాండింగ్ పెరుగుతుంది.

అంగారకుడి సంచార సమయంలో ఒక వ్యక్తి తన భావాలను సులభంగా వ్యక్తపరచగలుగుతాడు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు నిర్ణయాధికారం బలపడుతుంది. ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. తమ నిర్ణయాలతో ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. మేష రాశికి కుజుడు అధిపతి. అందువల్ల ఈ సమయం కొంతమందికి అనుకూలంగా ఉంటుంది. కొందరు తమ కలలను నెరవేర్చుకోవడానికి అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నిస్తారు.

కుజుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ గ్రహం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు మీ ఇంట్లో మంగళ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు, రాగి, మసూర్ దాల్ వంటివి దానం చేయవచ్చు. మీ ఇంట్లో ఎర్రటి పూల మొక్కలు నాటవచ్చు.

Whats_app_banner