Budhaditya raja yogam: మిథున రాశిలో బుధాదిత్య యోగం.. జూన్ నెల వీరికి ఒక వరం లాంటి సమయం-budhaditya raja yogam in mithuna rashi from june 15th 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Budhaditya Raja Yogam: మిథున రాశిలో బుధాదిత్య యోగం.. జూన్ నెల వీరికి ఒక వరం లాంటి సమయం

Budhaditya raja yogam: మిథున రాశిలో బుధాదిత్య యోగం.. జూన్ నెల వీరికి ఒక వరం లాంటి సమయం

Gunti Soundarya HT Telugu
Jun 01, 2024 09:24 AM IST

Budhaditya raja yogam: మిథున రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి జూన్ నెల ఒక వరంలా మారబోతుంది.

బుధాదిత్య రాజయోగం
బుధాదిత్య రాజయోగం

Budhaditya raja yogam: జూన్ నెలలో అనేక గ్రహాల సంచారం జరుగుతుంది. నెల మొదటి రోజే కుజుడు మేష రాశిలో ప్రవేశించాడు. ఇక గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు, గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు కూడా జూన్ నెలలో తమ రాశులు మార్చుకుంటాయి.

తెలివి, స్నేహం, తర్కం, మేధస్సు వంటి వాటికి బుధుడు కారకుడు. జూన్ 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం సూర్యుడు ప్రతిష్ఠ, ఉన్నత స్థితి, నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగా మిథునంలో మరోసారి సూర్య, బుధ గ్రహాల సంయోగం జరుగుతుంది. బుధాదిత్య యోగం సృష్టిస్తుంది. మిథునంలోని ఈ సంయోగం ఆరు రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది.

వృషభ రాశి

బుధాదిత్య యోగం ప్రభావంతో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సౌకర్యాలు పెరగడంతో సంతృప్తికరమైన జీవితం గడుపుతారు. ఆర్థికంగా సంపదతో స్థిరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలకు అనుకూలమైన కాలం ఇది. లాభాలు పెరిగే అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధిత రంగాలలో పురోభివృద్ధి లేదా జటిమ్ పెంపుదల కొరకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త స్నేహితులు మీ జీవితాన్ని మరింత అందంగా మార్చబోతున్నారు.

మిథున రాశి

సూర్యుడు, బుధుడి కలయిక జూన్ నెలలో మిథున రాశి వారికి అధ్భుతమైన ప్రయోజనాలు అందివ్వబోతుంది. ఈ కాలంలో అన్ని రంగాలలో విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఇతరులు మీ మాటలకు ఆకర్షితులు అవుతారు. సూర్యుడి ప్రభావంతో సామాజిక స్థితి పెరుగుతుంది. నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు పొందుతారు. విదేశీ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు.

సింహ రాశి

బుధ, సూర్య సంయోగం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. జీవితంలోని బాధ్యతలన్నింటినీ అద్భుతంగా నిర్వహిస్తూ అందరి మెప్పు పొందుతారు. ఆర్థిక సవాళ్ళు అధిగమించి కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. జీవినశైలిలో మార్పులు వస్తాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు ఆస్వాదిస్తారు. ఈ దశలో కొత్త వాహనం లేదా ఆస్తిని పొందాలనే మీ ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంది.

కన్యా రాశి

కన్యా రాశి వారి కోరికలు నెరవేరుతాయి. సామాజిక స్థితి పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, జీతం పెంపుదల, ప్రమోషన్ ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. రియల్ ఎస్టేట్, విదేశీ వెంచర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల అనుకూలమైన రాబడి పొందవచ్చు. మునుపటి పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల కోరికలు నెరవేర్చగలుగుతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. కొనుగోళ్లు, అమ్మకాలు చేసేందుకు ఇది అనుకూలమైన సమయం. గతంలో నిలిచిపోయిన ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. వైవాహిక బంధంలో పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. స్నేహితుల సహకారంతో అనేక పనులు సులభంగా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా సీనియర్లు వృత్తిలో సహకారం అందిస్తారు. మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు.

కుంభ రాశి

బుధాదిత్య రాజయోగం కుంభ రాశి వారికి శక్తినిస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో బంధాలు ఏర్పడతాయి. కెరీర్ పరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. వ్యాపారాలలో ఊహించని విజయం లభిస్తుంది. ఆర్థికపరంగా ఇది అనుకూలమైన సమయం. ప్రమోషన్ లభించడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు.

WhatsApp channel