Lucky zodiac signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు.. లక్ అంటే ఈ మూడు రాశుల వారిదే-four major planets conjunction in june month these zodiac signs get full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు.. లక్ అంటే ఈ మూడు రాశుల వారిదే

Lucky zodiac signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు.. లక్ అంటే ఈ మూడు రాశుల వారిదే

Gunti Soundarya HT Telugu
May 28, 2024 05:37 PM IST

Lucky zodiac signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వల్ల మూడు రాశుల వాళ్ళు భారీగా ప్రయోజనాలు పొందబోతున్నారు. వ్యాపారం, ఉద్యోగం, వైవాహిక జీవితంలో ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు.

జూన్ లో ఐదు రాజయోగాలు
జూన్ లో ఐదు రాజయోగాలు (pixabay)

Lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల చాలా ప్రత్యేకంగా మారనుంది. ఈ కాలంలో అనేక పెద్ద గ్రహాలు సంచారం, కలయిక జరుగుతుంది. ఫలితంగా ఐదు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.

నెల ప్రారంభంలో జూన్ 1న కుజుడు మేష రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఇక జూన్ 3న దేవ గురువు బృహస్పతి ఉదయించబోతున్నాడు. జూన్ 15న సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే జూన్ 14న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 12 సాయంత్రం శుక్రుడు మిథున రాశిలోకి వెళతాడు.

జూన్ నెలలో శుక్రుడు, బుధుడు, కుజుడు, సూర్యుడి సంచారం వల్ల శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఏ రాశిలో ఏ రాజయోగం ఏర్పడుతుందో తెలుసుకుందాం.

బుధాదిత్య యోగం

జూన్ మధ్యలో బుధుడు, సూర్యుడు మిథున రాశిలో సంయోగం చెందుతారు. దీని వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగాలలో ఒకటిగా పరిగణిస్తారు.

త్రిగ్రాహి యోగం

మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరుస్తారు. ఇది కూడా జూన్ మధ్యలోనే ఏర్పడుతుంది.

శుక్రాదిత్య యోగం

మిథున రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల కెరీర్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

గురు ఆదిత్య యోగం

వృషభ రాశిలో బృహస్పతి, సూర్యుడు కలిసి జూన్ 14 వరకు ఉంటారు. అప్పటి వరకు గురు ఆదిత్య యోగం ఉంటుంది. నవగ్రహాల రాజుగా సూర్యుడిని భావిస్తారు. ఆత్మ, అహం, ఆత్మవిశ్వాసం, తండ్రి అధికారాన్ని సూర్యుడు సూచిస్తాడు. బృహస్పతి గ్రహం సంపద, ఆనందాన్ని సూచిస్తాడు.

లక్ష్మీనారాయణ యోగం

ఇప్పటికే ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పరిచాయి. మళ్ళీ జూన్ నెలలో బుధుడు, శుక్రుడు కలిసి మిథున రాశిలో లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టించబోతున్నారు.

ఈ ఐదు రాజయోగాల వల్ల మూడు రాశుల వారు విపరీతమైన ప్రయోజనాలు పొందుబోతున్నారు. అవి ఏవో తెలుసుకుందాం.

వృషభ రాశి

ఈ ఐదు శుభ యోగాలు వృషభ రాశి వారికి శుభాలను ఇస్తాయి. పెట్టుబడుల ద్వారా జీవితంలో సౌకర్యాలు పెంచుకోగలుగుతారు. ఉద్యోగులు చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కెరీర్ లో చాలా స్థిరత్వం ఉంటుంది. సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు. మంచి పని తీరుతో ఉద్యోగాలలో అవకాశాలు లభిస్తాయి. సాంకేతికత వినియోగం మార్కెట్లో మిమ్మల్ని బలపరుస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తద్వారా లాభాలను పొందుతారు. ఆర్థిక జీవితం విషయంలో మంచి డబ్బు సంపాదిస్తారు. జీవితంలో ఆనందం సంతృప్తి పొందుతారు. డబ్బు ఆదా చేయగలుగుతారు.

మిథున రాశి

మూడు రాజయోగాలు మిథున రాశిలోనే ఏర్పడుతున్నాయి .ఫలితంగా ఈ రాశి వారికి శుభప్రదమైన కాలం రాబోతుంది. వీటి ప్రభావంతో జీవితాలు సుభిక్షంగా ఉంటాయి. ఉద్యోగాలలో చాలా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులు తమ పనిలో శ్రేయస్సును పొందుతారు. మీ జీవితంలోకి కొత్త స్నేహితులు వస్తారు. ఉద్యోగస్తులు ఈ కాలంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కెరీర్ లో మీ అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారు అగ్రస్థానానికి చేరుకొని మంచి లాభాలు గడిస్తారు. తమ పనితీరుతో విదేశీలలో కూడా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలను ఏర్పరచుకుంటారు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని సాగిస్తారు. అలాగే డబ్బుని ఆదా చేసుకుంటారు. సంబంధాల్లో ప్రేమ సామరస్యం ఉంటుంది. జీవితం భాగస్వాములు ఇద్దరూ పరస్పరం స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటారు.

మకర రాశి

జూన్ నెలలో ఏర్పడిన వివిధ శుభ యోగాల వల్ల మకర రాశి వారికి విజయాలు చేకూరతాయి. వృత్తిపరంగా ఉద్యోగులకు ఈ కాలం ఫలవంతంగా ఉంటుంది. ఏ పని చేసిన శుభ ఫలితాలు పొందుతారు. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగిన ఫలాలు అందుతాయి. విదేశీ పర్యటనలకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యం ఇది అనువైన సమయం. ఊహించిన మూలాల నుండి ఆదాయం పెరుగుతుంది. ఈ కాలంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు.

WhatsApp channel